SRH vs KKR: కాటేరమ్మ కొడుకు ఊచకోత.. కేకేఆర్‌కు నరకం చూపించాడు!
ABN , Publish Date - May 25 , 2025 | 09:13 PM
కాటేరమ్మ కొడుకు రెచ్చిపోయాడు. ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. భారీ షాట్లతో స్టేడియాన్ని షేక్ చేశాడు.

ఐపీఎల్-2025లో అంచనాలను అందుకోలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇంటిదారి పట్టింది. అయితే పోతూ పోతూ ఎదురొచ్చిన జట్లను వణికిస్తోంది ఎస్ఆర్హెచ్. లీగ్ దశ ముగింపులో వరుస విక్టరీలతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో ఆర్సీబీని చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ పని పడుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసెన్ అయితే ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్ బౌలర్లకు అతడు నరకం చూపించాడు. 37 బంతుల్లోనే సెంచరీ బాదేశాడీ విధ్వంసకారుడు. ఐపీఎల్ కెరీర్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
సిక్సుల వర్షం!
బ్యాటింగ్‌కు సహకరిస్తున్న ఢిల్లీ పిచ్‌పై క్లాసెన్ పిచ్చకొట్టుడు కొట్టాడు. చిన్న గ్రౌండ్ కావడంతో ఫోర్ల కంటే సిక్సులు కొట్టడమే టార్గెట్‌గా అతడు బ్యాటింగ్ చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్ల జాబితా (37 బంతుల్లో)లో యూసుఫ్ పఠాన్‌తో కలసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 9 భారీ సిక్సులు ఉన్నాయి. 269 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు కాటేరమ్మ కొడుకు. ఆఖరి బంతి వరకు బాదుడే బాదుడు అన్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (32), ఇషాన్ కిషన్ (29) కూడా రాణించడంతో 20 ఓవర్లలో 278 పరుగుల భారీ స్కోరు సెట్ చేసింది సన్‌రైజర్స్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి