SRH-RCB: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా.. ఆర్సీబీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:54 PM
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఊరట విజయాన్ని దక్కించుకుంది. వరుస ఓటములతో డీలాపడిన కమిన్స్ సేన.. సీఎస్‌కేను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించి తిరిగి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.

అడుగంటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు మళ్లీ చిగురించాయి. పనైపోయిందనుకుంటే తిరిగి రేసులోకి వచ్చింది కమిన్స్ సేన. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ పోటీ నుంచి తప్పుకున్నట్లు కనిపించిన ఆరెంజ్ ఆర్మీ.. ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. నెక్స్ట్ ఆడబోయే 5 మ్యాచుల్లోనూ నెగ్గితే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమయ్యే చాన్స్ ఉంది. అయితే అదంత ఈజీ కాదు. కానీ ఈ విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును స్ఫూర్తిగా తీసుకుంటోంది ఎస్‌ఆర్‌హెచ్. ఆ టీమ్ గత సీజన్‌లో చేసిన మ్యాజిక్‌నే తామూ రిపీట్ చేయాలని కమిన్స్ అండ్ కో భావిస్తున్నారు.
1 నుంచి 100 శాతానికి..
లాస్ట్ సీజన్‌లో సగం మ్యాచులు ముగిసేసరికి ఆర్సీబీ పనైపోయిందని అంతా అనుకున్నారు. మొదటి 8 మ్యాచుల్లో ఏడింట ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది బెంగళూరు. ప్లేఆఫ్స్ చేరాలంటే కేవలం 1 శాతం అవకాశం ఉన్న తరుణంలో కోహ్లీ థియరీతో చెలరేగిందా జట్టు. ఒక్క శాతం చాన్స్ ఉన్నా పోరాడి దాన్ని 100 శాతం చేయాలనే విరాట్ థియరీని పట్టుదలతో ఆచరణలో పెట్టి వరుసగా గెలుస్తూ పోయింది. ఆరుకు ఆరు మ్యాచుల్లో నెగ్గి ప్లేఆఫ్స్‌కు దూసుకుపోయింది. ఇప్పుడు ఇదే థియరీని ఫాలో అవుతోంది సన్‌రైజర్స్.
ఎన్ని నెగ్గాలంటే..
ఈసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే నెక్స్ట్ ఆడే ఐదుకు 5 మ్యాచుల్లోనూ ఆరెంజ్ ఆర్మీ నెగ్గాల్సిందే. అసాధ్యంగా అనిపిస్తున్న ఈ టార్గెట్‌ను సాధించి తీరుతామని కెప్టెన్ కమిన్స్‌తో పాటు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులాగే తామూ మ్యాజిక్ చేస్తామని కమిన్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఆడే అన్ని మ్యాచుల్లో గెలవాలని భావిస్తున్నామని.. లాస్ట్ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన విధంగానే తామూ అదే మెంటాలిటీతో బరిలోకి దిగుతామని నితీష్ చెబుతున్నాడు. దీంతో కాటేరమ్మ కొడుకుల పట్టుదల చూస్తుంటే ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ గనుక ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయితే ఆ క్రెడిట్ ఆర్సీబీకే ఇవ్వాలని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి