Share News

Gill-Gambhir: గిల్‌పై నమ్మకం లేదా? గంభీర్ ఎందుకిలా చేస్తున్నాడు!

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:12 PM

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారు భారత ఆటగాళ్లు. ప్రత్యర్థిని వాళ్ల సొంతగడ్డ మీదే చిత్తుగా ఓడించాలని చూస్తున్నారు.

Gill-Gambhir: గిల్‌పై నమ్మకం లేదా? గంభీర్ ఎందుకిలా చేస్తున్నాడు!
Shubman Gill

భారత కొత్త కెప్టెన్ శుబ్‌‌మన్ గిల్ కెరీర్‌లో అసలు సిసలు సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఇన్నాళ్లూ బ్యాటర్‌గా అదరగొట్టిన ఈ యంగ్ క్రికెటర్.. ఇక మీదట టెస్టుల్లో సారథిగా టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఇంగ్లండ్‌తో త్వరలో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ నాయకుడిగా గిల్‌కు ఫస్ట్ అస్సైన్‌మెంట్. అందుకే ఈ సిరీస్ కోసం అతడు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. బ్యాటింగ్‌లో అదరగొడుతూనే సారథిగా జట్టుపై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. అందుకే జట్టు సభ్యులతో కలసి ట్రెయినింగ్ సెషన్స్‌లో జోరుగా సాధన చేస్తున్నాడు. అలాగే టీమ్ మేనేజ్‌మెంట్‌తో కలసి గెలుపునకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నాడు. అయితే హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నుంచి గిల్‌కు అంతగా మద్దతు లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిల్‌ను వాళ్లు తక్కువ అంచనా వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


అంచనాల్లేవ్..

కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌కు తన కెప్టెన్సీ మీద పెద్దగా అంచనాలు లేవని గిల్ స్వయంగా అన్నాడు. ‘నా సారథ్యం గురించి గంభీర్-అగార్కర్‌తో పలుమార్లు చర్చించా. లీడర్‌గా నేనేం చేయగలనో అది చేయాల్సిందిగా వాళ్లు సూచించారు. నా కెప్టెన్సీపై ఎక్స్‌పెక్టేషన్స్ లేవని వాళ్లు అన్నారు. నేనేం చేయలేనో అది చేయాలని వాళ్లు భావించడం లేదు. అందుకే నా మీద ఎలాంటి ఒత్తిడి, అంచనాలు లేవు. అయితే వాళ్లు నాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకున్నా.. కెప్టెన్‌గా నాకంటూ నాపై కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి’ అని గిల్ చెప్పుకొచ్చాడు.

shubman-gill.jpg-1.jpg


ఎవరిది బాధ్యత?

గిల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుబ్‌మన్ సామర్థ్యం మీద గంభీర్-అగార్కర్‌కు నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. కెప్టెన్ మీద టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు అంచనాలు పెట్టుకోకపోవడం ఏంటి.. భవిష్యత్తులో జరిగే గెలుపోటములకు ఎవరిది బాధ్యత అని క్వశ్చన్ చేస్తున్నారు. గిల్ కెప్టెన్సీని ఇంత తక్కువ అంచనా వేయడం ఏంటో అర్థం కావడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నమ్మకం లేనప్పుడు సారథ్య పగ్గాలు ఇవ్వడం ఎందుకని నిలదీస్తున్నారు.

shubman-gill.jpg


ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 15 , 2025 | 04:13 PM