Shubman Gill-Sara Tendulkar: బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్.. ఆటాడుకున్న జడేజా!
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:51 AM
భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో గిల్‌ను ఆటపట్టిస్తూ కనిపించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.

క్రికెటర్ల లవ్ లైఫ్‌కు సంబంధించిన ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఫలానా అమ్మాయితో ప్రేమలో ఉన్నారు, ఫలానా హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తుంటాయి. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మీద కూడా ఇలాంటి రూమర్లు రావడం గమనించే ఉంటారు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని చాన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. శుబ్‌మన్ ఆడే మ్యాచులకు స్టేడియంలో సారా హాజరవడం, అతడి బ్యాటింగ్ టైమ్‌లో చప్పట్లు కొడుతూ ఆమె ఎంకరేజ్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. మరోసారి వీళ్లిద్దరూ హాట్ టాపిక్‌గా మారారు. అసలేం జరిగిందంటే..
ఆటపట్టించిన జడ్డూ..
దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బాధితుల కోసం ఇటీవల ఓ చారిటీ కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లో జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్లు ఈ వేడుకకు అటెండ్ అయ్యారు. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీతో కలసి ఈ ప్రోగ్రామ్‌కు వచ్చారు. భారత జట్టు ఆటగాళ్ల పక్కనే సచిన్ కుటుంబసభ్యులు కూర్చున్నారు. ఈ తరుణంలో గిల్‌ను ఆటపట్టించడం మొదలుపెట్టాడు జడేజా. అటు చూడు అంటూ అతడ్ని ఓ ఆటాడుకున్నాడు.
ఓరకంటితో..
జడేజా గిల్‌ను ఆటపట్టిస్తున్న సమయంలోనే సారా శుబ్‌మన్‌ను ఓరకంటితో చూసింది. అంతే జడ్డూతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. గిల్‌ను మరింత ఆటపట్టించసాగారు. ఈ కార్యక్రమంలో గిల్ సారాను చూడటం, సారా ఓరకంటితో అతడి వైపు చూడటం.. శుబ్‌మన్‌ను జడేజా ఆటపట్టిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. గిల్-సారా రిలేషన్‌షిప్ మరోమారు బయటపడిందని అంటున్నారు. వీళ్ల మధ్య ప్రేమ నిజమేనని, త్వరలో ఇద్దరూ పెళ్లి పీటలెక్కడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా గిల్-సారాలో ఎవరూ దీని మీద స్పందించలేదు. కాబట్టి వాళ్ల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం.
ఇవీ చదవండి:
సచిన్ వల్ల కానిది బుమ్రా సాధించాడు!
డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి