Share News

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

ABN , Publish Date - Mar 09 , 2025 | 07:58 PM

ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్. కివీస్ సంధించిన స్కోరును ఉఫ్‌మని ఊదేస్తోంది. 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క
Shreyas Iyer

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు సెలెబ్రిటీలు. సినీ రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు దుబాయ్ స్టేడియంలో సందడి చేశారు. క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూడా దుబాయ్‌లో ఎంటర్‌టైన్ చేశారు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా స్టేడియంలో హల్‌చల్ చేసింది. అయితే స్టైలిష్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌పై ఆమె బూతుల దండకం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది.. అయ్యర్‌ను అనుష్క ఎందుకు తిట్టాల్సి వచ్చింది.. అనేది ఇప్పుడు చూద్దాం..


క్యాచ్ నేలపాలు చేయడంతో..

కివీస్ ఇన్నింగ్స్ సమయంలో అయ్యర్ ఓ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. డైవ్ చేసినా బంతిని పట్టలేకపోయాడు. దీంతో గ్యాలరీలో కూర్చున్న అనుష్క బూతులు తిడుతూ అసహనాన్ని ప్రదర్శించింది. ఎందుకు మిస్ చేశావంటూ సీరియస్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. క్యాచ్ వదిలితే మాత్రం ఇలా తిట్టడం సరైనదేనా అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

రోహిత్ హాఫ్ సెంచరీ.. ఊచకోతకు డిసైడై వచ్చాడుగా..

వరుణ్ మ్యాజికల్ డెలివరీ.. ఆడే మొనగాడే లేడు

టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2025 | 07:58 PM