Share News

Sachin Tendulkar: 52 ఏళ్ల వయసులోనూ రప్పా రప్పా అంటున్న సచిన్.. ఇదేం ఊచకోత సామి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:00 PM

IML 2025: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్నాడు. బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. రప్పా రప్పా అంటూ పరుగుల వరద పారిస్తున్నాడు.

Sachin Tendulkar: 52 ఏళ్ల వయసులోనూ రప్పా రప్పా అంటున్న సచిన్.. ఇదేం ఊచకోత సామి
Sachin Tendulkar

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని అతడు మరోమారు ప్రూవ్ చేశాడు. జెంటిల్మన్ గేమ్‌కు రిటైర్మెంట్ ఇచ్చి 12 ఏళ్లు కావొస్తున్నా.. పరుగులు చేయాలనే కసి తనలో ఇంకా అలాగే ఉందని అతడు నిరూపించాడు. కుర్రాళ్ల మాదిరిగా క్రీజులో మెరుపు వేగంతో కదులుతూ అతడు కొట్టిన షాట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. క్రీజులో ఒక రకంగా అతడు డ్యాన్స్ చేస్తూ బౌలర్లను బిత్తరపోయేలా చేశాడు. ఈ వయసులోనూ భారీ షాట్లతో ఊచకోత కోశాడు. దీనికి వేదికగా నిలిచింది ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నమెంట్.


టార్గెట్‌ను ఊదిపారేసింది

రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో నిర్వహించే ఐఎంఎల్ టోర్నీలో ఇండియా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగాడు సచిన్. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ టీమ్ సంధించిన 132 పరుగుల టార్గెట్‌ను రీచ్ అవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 21 బంతుల్లో 5 బౌండరీలు, 1 భారీ సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ గురుకీరత్ సింగ్ మాన్ (35 బంతుల్లో 63 నాటౌట్‌)తో కలసి తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించాడు. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (14 బంతుల్లో 27 నాటౌట్) చెలరేగడంతో భారత్ మరో 8 ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదిపారేసింది. బ్యాటింగ్‌తోనే కాదు.. కెప్టెన్సీతోనూ సచిన్ ఆకట్టుకున్నాడు. కాగా, బౌలింగ్‌లో 2 వికెట్లతో రాణించిన పవన్ నేగీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


ఇవీ చదవండి:

నేను టీమిండియాను తప్పుపట్టలేదు: ప్యాట్ కమిన్స్

మ్యాచ్‌లన్నీ ఒక్కచోటే ఆడిస్తే ఎలా?

ఒలింపిక్‌ విజేతకు షాకిచ్చారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 12:06 PM