Sachin Tendulkar: కివీస్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవం.. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇన్నింగ్స్ గుర్తుందా
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:37 AM
IND vs NZ: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచి వేల పరుగులు వచ్చాయి. సుదీర్ఘ కెరీర్‌లో అతడు బద్దలు కొట్టని రికార్డు లేదు, అతడి ముందు దాసోహం అవ్వని అవార్డు లేదు. అయితే ఎన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నా అందులో నుంచి కొన్ని మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనాలి.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో పీక్‌లో ఉన్న టైమ్ అది. ముఖ్యంగా వన్డేల్లో అతడు బ్యాటింగ్‌కు దిగుతున్నాడంటేనే అంతా భయపడేవారు. అందర్నీ ఔట్ చేసినా అతనొక్కడే స్తంభంలా నిలబడిపోయి పరుగుల వరద పారిస్తాడనేది వాళ్ల భయం. అభిమానులు కూడా భారత జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియాలకు పోటెత్తేవారు. సచిన్ ఆడుతున్నాడంటే అన్ని పనులు మానేసి టీవీలకు అతుక్కుపోయేవారు. అందుకు తగ్గట్లే క్రికెట్ గాడ్ కూడా ఊరమాస్ బ్యాటింగ్‌తో అలరించేవాడు. ఇదే క్రమంలో న్యూజిలాండ్ మీద ఓ స్టన్నింగ్ నాక్ ఆడాడు సచిన్.
వాటే హిట్టింగ్
2002 సంవత్సరం, డిసెంబర్ 4వ తేదీ. ఆ రోజు క్రికెట్‌లో సరికొత్త ఎక్స్‌పెరిమెంట్ చేసింది ఐసీసీ. వన్డేల్లో 10 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్‌లతో ప్రయోగాత్మక మ్యాచ్ నిర్వహించింది. దీనికి క్రైస్ట్‌చర్చ్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ పోటీపడ్డాయి. అదే ఏడాది జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీలో కివీస్‌ను ఓడించిన టీమిండియా.. ఐసీసీ వన్డే ఫైట్‌లోనూ బ్లాక్‌క్యాప్స్‌ను చిత్తు చేయాలని డిసైడ్ అయింది. అప్పటికే ఓటమి భారంతో ఉన్న న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని వదలొద్దని భావించింది. భారత్‌ను ఓడించి పగ తీర్చుకోవాలని పంతం పట్టింది. అయితే ఆ టీమ్‌కు అడ్డుపడ్డాడు సచిన్. 27 బంతుల్లో 72 పరుగుల విధ్వంసక బ్యాటింగ్‌తో షేక్ చేశాడు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లతో అదరగొట్టాడు.
కొత్త రూల్
ఆ రోజు కివీస్‌కు కాళరాత్రి ఎలా ఉంటుందో పరిచయం చేశాడు సచిన్. బౌండరీలు, సిక్సులతో శివతాండవం చేశాడు. 3 బంతుల్లోనే 24 పరుగులతో క్రేజీ రికార్డు క్రియేట్ చేశాడు. అటు బ్యాట్‌తో పాటు ఇటు బంతితోనూ అతడు దుమ్మురేపినా భారత్ ఆ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే సచిన్ 3 బంతుల్లో 24 పరుగుల రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోయింది. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ప్రయోగాత్మక వన్డే కావడంతో ఆ మ్యాచ్‌లో ఐసీసీ ఓ వింత రూల్ ప్రవేశపెట్టింది. ప్రతి జట్టులో 11 మందికి బదులు 12 మంది ఆటగాళ్లను ఆడించింది.
ఫోర్ కొడితే 8 రన్స్!
క్రికెట్ మ్యాక్స్ ఇంటర్నేషనల్‌గా నామకరణం చేసిన ఈ మ్యాచ్‌లో సైట్ స్క్రీన్ పక్కన ఉన్న బౌండరీని మ్యాక్స్ జోన్‌గా ప్రకటించింది ఐసీసీ. అటు వైపు కొట్టిన బాల్‌కు డబుల్ రన్స్‌గా రూల్ పెట్టింది. అటువైపు 4 కొడితే 8 రన్స్, 6 కొడితే 12 రన్స్‌గా ఇస్తామని చెప్పింది. దీంతో షేన్ బాండ్, జాకబ్ ఓరమ్ లాంటి భీకర బౌలర్ల మీద బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు సచిన్. ఎంత క్లిష్టమైన బంతులు వేసినా డబుల్ రన్స్ ఇచ్చే జోన్‌కు బంతుల్ని పంపించి వేగంగా పరుగులు రాబట్టాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు అతడు మైదానంలోకి తరలించడం, సిక్సులు, ఫోర్ల మోత మోగించడాన్ని భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఇవీ చదవండి:
‘చాంపియన్స్’కు ముందు భలే చాన్స్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి