Share News

Rohit-Siraj: సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్.. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో..

ABN , Publish Date - May 06 , 2025 | 10:41 AM

Team India: స్పీడ్‌గన్ మహ్మద్ సిరాజ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మియాకు ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చాడు హిట్‌మ్యాన్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Rohit-Siraj: సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్.. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో..
Rohit Sharma-Mohammed Siraj

టీమిండియా స్పీడ్‌గన్ మహ్మద్ సిరాజ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సిరాజ్‌ను కలిశాడు హిట్‌మ్యాన్. ముంబై ఇండియన్స్ జెర్సీతో కనిపించిన అతడు.. సిరాజ్ దగ్గరకు ఓ బాక్స్‌ను తీసుకెళ్లాడు. అందులో నుంచి ఓ అందమైన రింగ్‌ను తీసి సిరాజ్‌కు అందించాడు రోహిత్. దాన్ని చూడగానే మియా ఆనందంలో మునిగిపోయాడు. ఆ ఉంగరాన్ని వేలికి తొడుక్కొని చాంపియన్ అంటూ మురిసిపోయాడు సిరాజ్. అసలు ఈ రింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..


ఏంటీ ఉంగరం కథ..

టీ20 వరల్డ్ కప్-2024ను సొంతం చేసుకున్న భారత జట్టులో సిరాజ్ కూడా ఉన్నాడు. ఈ ట్రోఫీ విన్నర్స్‌కు ఇటీవల కస్టమైజ్డ్ స్పెషల్ రింగ్స్‌ను బహూకరించారు. అయితే ఆ ఫంక్షన్‌కు సిరాజ్ హాజరు కాలేదు. దీంతో ఆ ప్రత్యేకమైన ఉంగరాన్ని రోహిత్ స్వయంగా తీసుకొచ్చి మరీ సిరాజ్‌కు ఇచ్చాడు. దీంతో సంతోషంలో మునిగిపోయాడు హైదరాబాదీ పేసర్. ఈ సమయంలో ఇద్దరు స్టార్లు నవ్వుతూ హ్యాపీగా కనిపించారు. దీంతో ఓ కాంట్రవర్సీకి తెరపడిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వీళ్లిద్దరూ ఒక్కటయ్యారని.. టీమిండియాలో వివాదాలకు తావు లేదని చెబుతున్నారు.


కాంట్రవర్సీకి బ్రేక్..

ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్‌ను ఆడించలేదు భారత్. వన్డేలు, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడ్ని దుబాయ్‌కు తీసుకెళ్లలేదు. దీంతో సిరాజ్‌ను రోహిత్ కావాలనే దూరం పెట్టాడంటూ రూమర్లు మొదలయ్యాయి. అతడి కెరీర్‌తో ఆడుకుంటున్నారనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయింది. తాజా సీజన్‌లో జీటీ తరఫున వికెట్ల మీద వికెట్లు తీస్తూ అదరగొడుతున్న సిరాజ్.. చాంపియన్స్ ట్రోఫీలో తనను ఆడించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో రోహిత్-సిరాజ్‌కు నిజంగానే పడట్లేదా.. అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఎట్టకేలకు హిట్‌మ్యాన్ స్వయంగా వచ్చి స్పెషల్ రింగ్‌ను సిరాజ్‌కు అందించడంతో పాత గాయం మానిందని నెటిజన్స్ అంటున్నారు. హిట్‌మ్యాన్ ఏం చేసినా అది టీమ్ బాగు కోసమేనని చెబుతున్నారు. దుబాయ్‌ పిచ్‌పై స్పిన్నర్లు కీలకమనే ఉద్దేశంతోనే సిరాజ్‌ను ఆడించలేదని.. అంతమాత్రాన కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. సిరాజ్-రోహిత్ బాండ్ ఎంత బలంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


ఇవీ చదవండి:

7 జట్లు.. 4 బెర్త్‌లు.. ఎవరెన్ని నెగ్గాలంటే..

సన్‌రైజర్స్ ఔట్.. తాను తీసిన గోతిలో తానే..

ఇండియన్‌ ఐడల్‌ నుంచి ఐపీఎల్‌కు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 06 , 2025 | 10:50 AM