Virat Kohli: కోహ్లీకి ఫ్యాన్స్ ట్రిబ్యూట్.. ఇది కదా అభిమానం అంటే..
ABN , Publish Date - May 17 , 2025 | 02:57 PM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌బేస్ గురించి తెలిసిందే. స్టన్నింగ్ బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు కింగ్. వరల్డ్ క్రికెట్ ఐకాన్‌గా విరాట్ గుర్తింపు సంపాదించడంలో అతడి ఆటతో పాటు అభిమానగణం పాత్ర కూడా కీలకమనే చెప్పాలి.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. ఇండో-పాక్ ఉద్రిక్తతల వల్ల మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 రీస్టార్ట్ కానుండటంతో మిగిలిన మ్యాచుల్లో రచ్చ చేయాలని చూస్తున్నాడు కింగ్. ఇటీవల టెస్టులకు వీడ్కోలు చెప్పేసిన అతడు.. ఇకపై వన్డేల్లో కొనసాగనున్నాడు. ఏడాదికోసారి ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్‌లోనూ హంగామా చేయనున్నాడు విరాట్. అయితే కోహ్లీ అభిమానులు మాత్రం అతడు రిటైర్‌మెంట్ ప్రకటించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరికొన్నేళ్లు ఆడతాడని అనుకుంటే అర్ధాంతరంగా గుడ్‌బై చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. అయితే క్రమంగా ఆ బాధ నుంచి కోలుకుంటున్న ఫ్యాన్స్.. తమ అభిమాన ఆటగాడికి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
చిన్నస్వామి తెలుపుమయం..
ఐపీఎల్-2025 శనివారం నాడు రీస్టార్ట్ అవుతోంది. ఆర్సీబీ-కేకేఆర్ నడమ చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్న కోహ్లీ కోసం అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చాడు కాబట్టి.. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆర్సీబీ జెర్సీకి బదులు టీమిండియాకు ఆడినప్పుడు కోహ్లీ వేసుకున్న 18 నంబర్ వైట్ జెర్సీలతో చిన్నస్వామి స్టేడియంలో సందడి చేయనున్నారు ఫ్యాన్స్. మొత్తం మైదానాన్ని తెలుపుమయం చేసేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు. స్టేడియం దగ్గర ఫ్యాన్స్ వైట్ జెర్సీలతో హంగామా చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. అబ్బబ్బ.. మీ అభిమానం సల్లగుండ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ అభిమానం అంటే అని మెచ్చుకుంటున్నారు. విరాట్ రాణించినా, విఫలమైనా కెరీర్ మొత్తం అండగా ఉన్న ఇలాంటి ఫ్యాన్‌బేస్ చాలా అరుదు అని చెబుతున్నారు నెటిజన్స్.
ఇవీ చదవండి:
ఐపీఎల్ రీస్టార్ట్‌కు వాన ముప్పు
కోహ్లీ టెన్త్ మార్క్ షీట్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి