Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!
ABN , Publish Date - Jul 04 , 2025 | 10:21 AM
ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు రవీంద్ర జడేజా. మళ్లీ నోరెత్తకుండా చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్. అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు చేసింది. శుబ్‌మన్ గిల్ (269) కెప్టెన్సీ నాక్‌తో చెలరేగాడు. భారీ ద్విశతకంతో చరిత్ర సృష్టించాడు. అతడితో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (89) రాణించారు. గిల్-జడేజా భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేసింది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఆఖరుకు ఆ టీమ్ సారథి బెన్ స్టోక్స్ జడేజాతో మైండ్‌గేమ్స్ ఆడేంత వరకు వెళ్లింది. కావాలనే అలా పరిగెత్తుతున్నావంటూ జడ్డూను స్టోక్స్ టార్గెట్ చేయడం రెండో రోజు ఆటలో చర్చనీయాంశంగా మారింది.
నాకేం అవసరం?
భారత ఇన్నింగ్స్ సమయంలో జడేజా వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న తీరుపై స్టోక్స్ సీరియస్ అయ్యాడు. భారత బౌలర్లకు వికెట్ నుంచి మద్దతు లభించాలనే ఉద్దేశంతో పిచ్‌పై జడ్డూ పరుగులు తీస్తున్నాడని అన్నాడు. రఫ్ స్పాట్‌లు ఏర్పడేలా స్టంప్స్‌కు దగ్గరగా పరుగులు తీస్తున్నాడంటూ టీమిండియా ఆల్‌రౌండర్‌పై అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే జడేజా వెనక్కి తగ్గలేదు. నాకేం అవసరం.. నేనెందుకు అలా చేస్తానంటూ ఇంగ్లండ్ సారథికి ఇచ్చిపడేశాడు. గెలుపు కోసం పిచ్చి పనులు చేయాల్సిన అవసరం తనకు లేదన్నాడు.
డేంజర్ జోన్‌లో..
డేంజర్ ఏరియాలో పరిగెత్తాల్సిన అవసరం తనకు లేదని.. ఆ జోన్‌లో తాను బౌలింగ్ చేయనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు జడేజా. దీంతో స్టోక్స్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన ఫోకస్ మొత్తం బ్యాటింగ్ మీదే ఉందంటూ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు. మాటకు మాట సమాధానం చెప్పాడు టీమిండియా ఆల్‌రౌండర్. దీనిపై మ్యాచ్ తర్వాత కూడా క్లారిటీ ఇచ్చాడు జడ్డూ. ‘నేను కావాలనే డేంజర్ జోన్‌లో పరిగెత్తుతూ రఫ్ వచ్చేలా చేస్తున్నానని స్టోక్స్ అనుకున్నాడు. అయితే ఇలాంటివి ఫాస్ట్ బౌలర్లు చేస్తుంటారు. దీంతో నాకేం అవసరం? నేను వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నానని అతడు పదే పదే అంపైర్లకు చెబుతూ వచ్చాడు. కానీ నాకు చెడు ఉద్దేశం లేదు. అది అనుకోకుండా జరిగి ఉండొచ్చు. కానీ కావాలని చేసిందైతే కాదు’ అని జడేజా స్పష్టం చేశాడు. కాగా, స్టోక్స్‌తో వాగ్వాదం తర్వాత అతడి బౌలింగ్‌లో వరుస బౌండరీలతో వణికించాడు జడ్డూ.
వీ చదవండి:
సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్
పాక్ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి