Team India: టీమిండియాకు అతడో టార్చ్‌బేరర్.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:16 PM
Ravichandran Ashwin: భారత జట్టుపై దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌లోని ఓ ఆటగాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడు టీమిండియాకు టార్చ్‌బేరర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.

టెస్టుల్లో ఆ మధ్య తడబడిన భారత్.. తనకు అచ్చొచ్చిన వైట్‌బాల్ క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లను అలవోకగా కైవసం చేసుకుంది. పొట్టి సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకున్న మెన్ ఇన్ బ్లూ.. టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ముఖ్యంగా వన్డేల్లో ఇంగ్లీష్ టీమ్‌పై ప్యూర్ డామినేషన్ చూపించింది రోహిత్ సేన. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. ఈ గెలుపుతో దొరికిన కాన్ఫిడెన్స్‌తో చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం అవుతోంది. ఈ తరుణంలో దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..
స్వార్థం లేని సారథి!
టీమిండియాకు రోహిత్ శర్మ ఎంతో కీలకమని అన్నాడు అశ్విన్. అతడు జట్టుకు ఇరుసు లాంటోడని చెప్పాడు. బ్యాటర్‌గా, సారథిగా అతడు టీమ్‌ను నడిపించే తీరు, గెలిపించే విధానం, నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన పద్ధతి అద్భుతమని ప్రశంసల్లో ముంచెత్తాడు అశ్విన్. భారత జట్టుకు హిట్‌మ్యాన్ ఓ టార్చ్‌బేరర్ అని మెచ్చుకున్నాడు. అతడో నిస్వార్థమైన క్రికెటర్ అని.. రోహిత్‌లో ఈ విషయమే తనకు చాలా ఇష్టమన్నాడు మాజీ ఆఫ్ స్పిన్నర్. స్వార్థం లేదు గనుకే అతడు వన్డేల్లో టీ20 మాదిరిగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. పవర్‌ప్లేతో పాటు ఏ ఓవర్‌నూ లెక్కచేయకుండా ఫుల్ అగ్రెసివ్ మోడ్‌లో ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు.
అందుకే అతడు గ్రేట్!
‘రోహిత్‌లో స్వార్థం లేదు. టీమ్ కోసమే అతడు ఆడతాడు. జట్టు గెలుపు కోసం మైలురాళ్లను పక్కనబెట్టి అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు. రికార్డులను అతడు పట్టించుకోడు. అందుకే నేను అతడ్ని అంతగా గౌరవిస్తా. సారథి ఎలా ఆడాలో అతడు చూపిస్తున్నాడు. అందరూ ఆ బాటలో నడిచేలా చేస్తున్నాడు. ఆటగాళ్ల కంటే ఆట గొప్పదనేది అతడి విశ్వాసం. అందుకే ఎప్పటికప్పుడు గేమ్‌కు తగ్గట్లు తనను తాను మార్చుకొని నిస్వార్థంగా ఆడుతూ ముందుకెళ్తున్నాడు. ఔట్, నాటౌట్, యావరేజ్, రికార్డ్స్.. ఇలాంటివి పట్టించుకోకుండా టీమ్ కోసమే ఆడుతున్నాడు. అందుకే అతడు గ్రేట్’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అతడు జట్టుకు ఊపిరి అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.
ఇవీ చదవండి:
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
చాంపియన్స్ ట్రోఫీ ఫుల్ స్క్వాడ్స్
బీసీసీఐకి భారీగా బొక్క పెట్టిన స్టార్ బ్యాటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి