Ravi Ashwin: భార్య మాటలకు అశ్విన్ షాక్.. అతడ్ని ప్రేమిస్తున్నావా అని అడగడంతో..
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:39 PM
Ravichandran Ashwin On Australia Tour: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించి యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు చేస్తూనే ఫ్యామిలీతోనూ ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటున్నాడు. ఇటీవలే ప్రొఫెషనల్ క్రికెట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే అతడు కంటిన్యూ కానున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అధిక సమయం దొరకడంతో యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు చేసుకుంటూనే భార్యా పిల్లలతోనూ ఎక్కువ సేపు గడుపుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇన్నాళ్లూ బిజీబిజీగా ఉన్న అశ్విన్.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా క్రికెట్ గురించి అవకాశం దొరికిన ప్రతిసారి ఆసక్తికర విశేషాలు పంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ టూర్ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భార్య ప్రీతి నారాయణన్ మాటలకు షాక్ అయ్యానని అన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
సతీమణి సీరియస్!
ప్రస్తుత క్రికెట్‌లో ఫ్యాబ్-4లో ఒకడిగా ప్రసిద్ధి గాంచాడు స్టీవ్ స్మిత్. ఏళ్లుగా నిలకడగా పరుగులు చేస్తూ విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్ లాంటి టాప్ బ్యాటర్ల సరసన అతడు చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టన్నుల కొద్దీ పరుగులతో దిగ్గజ స్థాయిని అందుకున్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో స్మిత్‌కు బౌలింగ్ చేయాలంటే తోపు బౌలర్లు కూడా జడుసుకుంటారు. అతడు వికెట్ ఇవ్వకపోగా.. ధనాధన్ పరుగులు చేస్తూ అపోజిషన్ టీమ్‌ను భయపెడుతుంటాడు. అలాంటి స్మిత్‌ను ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఔట్ చేసేందుకు అశ్విన్ ఓ పని చేశాడట. అతడి బ్యాటింగ్ వీడియోలు పదే పదే చూస్తూ ఉండిపోయాడట. అయితే ఇది చూసిన అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ సీరియస్ అయ్యిందట. అతడ్ని ప్రేమిస్తున్నావా? అని అడిగేసిందట.
నేరుగా అడిగేసింది!
స్మిత్‌తో ప్రేమలో పడ్డావా? పదే పదే అతడ్ని ఎందుకు చూస్తున్నావ్? అంటూ కోప్పడిందట ప్రీతి నారాయణన్. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ రివీల్ చేశాడు. ‘స్మిత్‌ను ఔట్ చేసేందుకు చాలా కష్టపడ్డా. అతడి బ్యాటింగ్ వీడియోలు విపరీతంగా చూశా. అతడి బ్యాటింగ్ టెక్నిక్ గమనించా. ఇంట్లో ఉన్నా అదే పనిగా దీని గురించే ఆలోచిస్తూ వీడియోలు చూస్తూ ఉండిపోయా. భార్యా పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. దీంతో నా సతీమణి ప్రీతి ‘స్మిత్ మీద ప్రేమ ఉందా?’ అని అడిగింది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. స్మిత్ బ్యాటింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుందన్నాడు. అతడి చేయి వాడే విధానాన్ని పసిగట్టి.. 2018 సిరీస్‌లో అలాంటి బంతులు వేసి ఔట్ చేశానన్నాడు వెటరన్ స్పిన్నర్.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి