SRH vs MI Hardik Pandya: పహల్గాం అటాక్.. గ్రౌండ్‌లో హార్దిక్ సీరియస్.. ఏమన్నాడంటే..
ABN , Publish Date - Apr 23 , 2025 | 07:35 PM
IPL 2025: యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన పహల్గాం ఉగ్రదాడిపై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. టెర్రర్ అటాక్ బాధితులకు తాము అండగా ఉంటామని ధీమా ఇచ్చాడు పాండ్యా. అతడు ఇంకా ఏమన్నాడంటే..

దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది పహల్గాం టెర్రర్ అటాక్. కశ్మీరు లోయలో మరోసారి పేట్రేగిపోయిన ఉగ్రవాదులు 28 మంది అమాయక పర్యాటకులను బలిగొన్నారు. ఈ దారుణ ఘటనపై సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అంతా గొంతు విప్పుతున్నారు. తాజాగా ఈ ఘటనపై స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రియాక్ట్ అయ్యాడు. టెర్రర్ అటాక్‌ను అతడు తీవ్రంగా ఖండించాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని ధీమా ఇచ్చాడు పాండ్యా. అతడు ఇంకా ఏమన్నాడంటే..
ఇదో పిరికిదాడి..
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ షురూ అయింది. అయితే టాస్ టైమ్‌లో పహల్గాం ఘటనపై ఎంఐ కెప్టెన్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రజలపై జరిగిన ఈ పిరికిదాడిని తాము ఖండిస్తున్నామని పాండ్యా అన్నాడు. బాధిత కుటుంబాలకు బలం, ధైర్యం చేకూరాలని కోరాడు. ఒక టీమ్‌గా ఆ ఫ్యామిలీస్‌కు తాము సపోర్ట్‌గా ఉంటామని పాండ్యా భరోసా ఇచ్చాడు. ఈ ఘటన గురించి వినగానే తన హృదయం ముక్కలైందన్నాడు సన్‌రైజర్స్ సారథి కమిన్స్. ఆస్ట్రేలియా పౌరులుగా భారత ప్రజలకు తాము అండగా ఉంటామన్నాడు. భారత్ తమకు ఎప్పుడూ మిత్రదేశమని చెప్పుకొచ్చాడు. కాగా, టాస్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అంపైర్లు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హార్దిక్ తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇవీ చదవండి:
సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్
న్యాయం జరగాల్సిందే.. స్టార్ల డిమాండ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి