Share News

Mohammed Siraj Fined: సిరాజ్‌కు ఐసీసీ షాక్.. తప్పని తేలడంతో..!

ABN , Publish Date - Jul 14 , 2025 | 01:50 PM

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..

Mohammed Siraj Fined: సిరాజ్‌కు ఐసీసీ షాక్.. తప్పని తేలడంతో..!
Mohammed Siraj

లార్డ్స్ టెస్ట్ ఊహించిన దాని కంటే మరింత ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటుండటంతో సెషన్ సెషన్‌కూ ఆధిపత్యం మారుతూ పోతోంది. నాలుగో రోజు ఆటలో అటు ఇంగ్లండ్, ఇటు భారత్ నువ్వానేనా అంటూ పోరాడటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఆతిథ్య జట్టుదే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. ఐదో రోజు ఆట తొలి గంటలో ఎవరు బాగా ఆడితే వాళ్ల వైపే ఫలితం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలేం జరిగిందంటే..


కొంపముంచిన దూకుడు..

టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. అతడికి జరిమానా విధించారు మ్యాచ్ రిఫరీ. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్ 1 నిబంధనను అతిక్రమించినందుకు సిరాజ్ మ్యాచ్ ఫీజులో నుంచి 15 శాతం కోత విధించారు. ‘బ్యాటర్‌‌తో మాట్లాడిన తీరు, వాడిన భాష, చేష్టలు సరిగ్గా లేవు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇంత దూకుడుగా స్పందించొద్దు. అందుకే జరిమానా విధించాం’ అని మ్యాచ్ అధికారులు తెలిపారు.


ఉరిమి చూస్తూ..

లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో సిరాజ్ దూకుడుగా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆతిథ్య జట్టు ఓపెనర్‌ బెన్ డకెట్‌ను ఔట్ చేశాక అతడి మీదకు దూసుకెళ్లాడు భారత్ పేసర్. డకెట్‌ను సీరియస్‌గా చూస్తూ ఏదో కామెంట్ చేశాడు సిరాజ్. దీనిపై విచారణ జరిపిన మ్యాచ్ అధికారులు.. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించడంతో అతడికి మ్యాచ్ ఫీజులో నుంచి 15 శాతం ఫైన్ వేశారు.


ఇవీ చదవండి:

పౌల్ రఫెల్ ఉంటే గెలవడం కష్టం..

రాహుల్‌ను రెచ్చగొడుతున్నారు..

విజయం అటా ఇటా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 01:51 PM