IPL 2025: స్టార్క్ నుంచి బట్లర్ దాకా.. ఐపీఎల్ మిస్ కానున్న స్టార్లు వీళ్లే..
ABN , Publish Date - May 15 , 2025 | 12:51 PM
IPL Franchises: ఐపీఎల్-2025 త్వరలో మళ్లీ ప్రారంభం కానుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. అయితే ఫ్రాంచైజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పలువురు కీలక ఆటగాళ్లు మిస్ అవుతుండటంతో జట్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఐపీఎల్-2025 త్వరలో రీస్టార్ట్ కానుంది. మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు మొదలవనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో భారత క్రికెట్ బోర్డు బిజీబిజీగా ఉంది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడటం, మస్తు వినోదాన్ని అందించే ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. తమ ఫేవరెట్ ప్లేయర్ల గేమ్ చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇలా అంతా ఆనందంగా ఉన్నా ఫ్రాంచైజీలకు మాత్రం ఏదీ పాలుపోవడం లేదు. పలువురు విదేశీ స్టార్లు మిగిలిన మ్యాచులకు దూరమవడంతో జట్లకు దిక్కు తోచడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన ఐపీఎల్ మ్యాచులకు దూరం కానున్న ఓవర్సీస్ ప్లేయర్లు ఎవరెవరనేది ఇప్పుడు చూద్దాం..
కారణాలు ఇవే..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉండటం, గాయాల బెడద కూడా ఉండటంతో అటు ఆస్ట్రేలియా, ఇటు సౌతాఫ్రికా నుంచి కొందరు కీలక ఆటగాళ్లు మిగిలిన ఐపీఎల్ మ్యాచులు మిస్ కానున్నారు. వెస్టిండీస్ సిరీస్ నేపథ్యంలో పలువురు ఇంగ్లండ్ స్టార్లూ భారత ఫ్లైట్ ఎక్కలేకపోతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25నే ఐపీఎల్ ముగియాలి. కానీ అలా జరగకపోవడంతో ఓవర్సీస్ ప్లేయర్లు అందుబాటులో లేకుండా పోయారు. కగిసో రబాడ, షెఫానీ రూథర్‌ఫోర్డ్, జోస్ బట్లర్ సేవల్ని కోల్పోనుంది గుజరాత్ టైటాన్స్. విల్ జాక్స్, కార్బిన్ బోష్ లీగ్ దశకు మాత్రమే అందుబాటులో ఉండనున్నారు.
వీళ్లంతా దూరం..
ఆస్ట్రేలియా స్టార్లు జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ కూడా మిగిలిన ఐపీఎల్ మ్యాచులకు దూరంగా ఉండనున్నారు. ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. మరో డీసీ స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా భారత్‌కు రావడం లేదని తెలుస్తోంది. ఇంగ్లండ్ స్టార్ బేతెల్ కూడా దూరం కానున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ లుంగి ఎంగిడి భారత్‌కు వచ్చినా ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నాడు. ఇలా కీలక ఆటగాళ్లంతా రాకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఇది విజయావకాశాల్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే జట్ల కష్టాలు పగోడికీ రాకూడదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి