Kevin Sinclair: క్రికెట్‌లో ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడూ చూసుండరు.. గాల్లో పల్టీలు కొడుతూ
ABN , Publish Date - Jan 26 , 2025 | 07:32 PM
PAK vs WI: వికెట్ తీసినప్పుడు బౌలర్లు సెలబ్రేట్ చేసుకోవడం కామనే. అయితే కొందరు అతిగా సెలబ్రేట్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. మరికొందరు చిత్ర విచిత్రంగా తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకొని వైరల్ అవుతుంటారు.

క్రికెట్‌లో ఒక్కో ఆటగాడు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు గాల్లో పంచులు విసురుతూ, సాధించామంటూ సంతోషంలో మునిగిపోతారు. మరికొందరు గ్రౌండ్‌ను ముద్దాడుతూ, అభిమానులకు సెల్యూట్ పెడుతూ డిఫరెంట్‌గా తమ ఆనందాన్ని చూపిస్తుంటారు. ఇంకొందరు ఊహకందని రీతిలో చిత్ర విచిత్రమైన రీతిలో విన్యాసాలు చేస్తూ ఇదేం సెలబ్రేషన్ రా బాబు అనేలా చేస్తుంటారు. అలాంటి ఓ సెలబ్రేషనే ఇది. పాకిస్థాన్-వెస్టిండీస్‌కు మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. క్రికెట్‌లో ఎప్పుడూ చూడనటువంటి సెలబ్రేషన్‌ను చేసి చూపించాడో కరీబియన్ ఆటగాడు. అతడు ఎవరు? ఎలా తన సంతోషాన్ని చూపించాడో ఇప్పుడు చూద్దాం..
దూరంగా పరిగెత్తుతూ..
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో విండీస్ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్ ఓ చిన్న పనితో వార్తలకెక్కాడు. పాక్ ఓపెనర్, కెప్టెన్ షాన్ మసూద్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు సింక్లెయిర్. కీలక సమయంలో వికెట్ పడటం, ప్రత్యర్థి జట్టు సారథిని ఔట్ చేయడంతో కెవిన్ ఆనందం పట్టలేకపోయాడు. సహచరులతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరికీ దూరంగా పరిగెత్తుతూ అనూహ్యంగా గాల్లో పల్టీలు కొట్టాడు. తల కిందకు, కాళ్లు పైకి చేసి గాల్లో పల్టీలు కొడుతూ తిరిగి పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాటే అథ్లెటిజమ్!
కెవిన్ సింక్లెయిర్ కోల్డ్ సెలబ్రేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇలాంటిది బహుశా క్రికెట్‌లో ఇదే తొలిసారి కావొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. అతడి బౌలింగ్ కంటే కూడా ఫిట్‌నెస్, అథ్లెటిజమ్ టాలెంట్‌ను మరింత మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి పాక్ 4 వికెట్ల నష్టానికి 76 పరుగులతో ఉంది. సౌద్ షకీల్ (13 నాటౌట్), కాశిఫ్ అలీ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నెగ్గాలంటే పాక్ మరో 178 పరుగులు చేయాలి. అదే విండీస్ 6 వికెట్లు తీయాలి. మూడో రోజు ఏదో ఒక టీమ్ విజయం నమోదు చేయడం ఖాయం. మరి.. అది ఆతిథ్య జట్టా? పర్యాటక జట్టా? అనేది చూడాలి.
ఇదీ చదవండి:
నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్
ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోహ్లీకి అదిరిపోయే ఆఫర్.. ఫ్యాన్స్ కోసమైనా మిస్ అవ్వొద్దు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి