Share News

Jos Buttler: చాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్.. బట్లర్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Feb 28 , 2025 | 08:18 PM

Champions Trophy 2025: ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లీష్ టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేయడంతో బట్లర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అతడి డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jos Buttler: చాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్.. బట్లర్ సంచలన నిర్ణయం
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఫేవరెట్లలో ఒకటిగా అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టు చెత్తాటతో పరువు పోగొట్టుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి మెగా టోర్నమెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో పరాజయం పాలైన బట్లర్ సేన.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఇంగ్లీష్ టీమ్‌కు ఒరిగేదేమీ లేదు. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య పగ్గాల నుంచి పక్కకు జరుగుతున్నట్లు అతడు ప్రకటించాడు. ఇంకా బట్లర్ ఏమన్నాడంటే..


కొత్త సారథి కావాలి

కరాచీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ సారథిగా తనకు ఆఖరిదని బట్లర్ వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వైట్‌బాల్ కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు అతడు తెలిపాడు. ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నా. ఇది నాకే కాదు.. జట్టుకు కూడా కరెక్ట్ డెసిషన్ అని భావిస్తున్నా. నా స్థానంలో మరో ప్రతిభావంతుడైన ఆటగాడు జట్టు పగ్గాలు తీసుకుంటాడని అనుకుంటున్నా. టీమ్‌ను సరైన లక్ష్యం దిశగా నడిపిస్తాడని ఆశిస్తున్నా’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చాడు బట్లర్. ఇంగ్లండ్‌కు కొత్త కెప్టెన్ ఆవశ్యకత ఉందని స్పష్టం చేశాడతను. కోచ్ మెకల్లమ్‌తో కలసి అతడు టీమ్‌ను సమర్థంగా ముందుకు నడిపిస్తాడని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. మరి.. జోస్ బట్లర్ స్థానంలో ఇంగ్లండ్ కొత్త సారథిగా ఎవర్ని నియమిస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

ఈ సిక్స్ చూస్తే కంగారూలకు నిద్రపట్టదు

ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్..

ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 08:26 PM