Share News

Rohit-Kohli IPL 2025: రిటైర్మెంట్‌పై రోహిత్-కోహ్లీ వెనక్కి.. ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:47 PM

Team India: భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం కంటిన్యూ అవుతున్నారు. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా సూపర్బ్ నాక్స్‌తో అలరిస్తున్నారు. వాళ్ల జోరు చూస్తుంటే టీ20లకు గుడ్‌బై చెప్పి తప్పు చేశారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Rohit-Kohli IPL 2025: రిటైర్మెంట్‌పై రోహిత్-కోహ్లీ వెనక్కి.. ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు
Rohit-Virat

టీమిండియా మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తాజా ఐపీఎల్ సీజన్‌లో చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఆరంభం నుంచి అదరగొడుతుంటే.. హిట్‌మ్యాన్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాడు. గత కొన్ని మ్యాచుల్లో అతడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ 9 మ్యాచుల్లో 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ స్థానంలో నిలిచాడు. రోహిత్ 8 మ్యాచుల్లో 228 పరుగులతో ఉన్నాడు. ఇద్దరి విధ్వంసం చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఆ లెవల్‌లో కన్‌సిస్టెంట్‌గా రన్స్ చేస్తూ.. తోపు బౌలర్లను కూడా ఫోర్లు, సిక్సులతో బౌలింగ్ వేయాలంటే భయపడేలా చేస్తున్నారు. దీంతో పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ద్వారా ఈ స్టార్లు తప్పు చేశారా.. అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లిద్దరూ రిటైర్మెంట్ డెసిషన్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.


తొందరపడ్డారా..

టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా సొంతం చేసుకోగానే కోహ్లీ-రోహిత్ ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌లో వాళ్లు చెలరేగి ఆడుతున్న తీరు, వయసుతో సంబంధం లేకుండా విధ్వంసం సృష్టిస్తున్న విధానం, ఫార్మాట్‌కు తగ్గట్లు ముందుకు వెళ్తున్న తీరు, ఫిట్‌నెస్.. ఇలా చాలా విషయాలు వాళ్లు టీ20 రిటైర్మెంట్‌ విషయంలో తొందరపడ్డారేమోననే అభిప్రాయాలకు తావిస్తున్నాయి. అదే టైమ్‌లో రిటైర్మెంట్ అంశంలో రివర్స్ గేర్ వేయాలనే డిమాండ్‌కూ ఊతం ఇస్తున్నాయి.


ఒలింపిక్స్‌లో ఆడతారా..

ఐపీఎల్‌లో రోహిత్-కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. వీళ్లు టీ20లను ఎందుకు వదిలేశారా అనే క్వశ్చన్స్‌కు చాన్స్ ఇస్తోంది. వీళ్లిద్దరూ లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్-2028లో ఆడి తీరాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫామ్, ఫిట్‌నెస్ ఉండి కూడా ఆడకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రోకో జోడీ ఆడితే విశ్వక్రీడల్లో భారత్‌కు గోల్డ్ మెడల్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒలింపిక్స్‌లో ఆడటంపై ఇటీవల కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. ఆ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరితే తాను ఆడేందుకు రెడీ అన్నాడు. మరో 3 ఏళ్లు ఇదేరీతిన ఆడితే ఒలింపిక్స్‌ సవాల్‌కు తాను సిద్ధమని అతడు హింట్ ఇచ్చినట్లయింది. అయితే కోహ్లీ ఓపెన్ అయినా రోహిత్ మాత్రం తన మనసులోని మాట బయటపెట్టలేదు. రోహిత్-కోహ్లీ ఈ రేంజ్‌లో చెలరేగి ఆడటం, విరాట్ ఒలింపిక్స్‌పై ఓపెన్ అవడం.. అంతా చూస్తుంటే ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ ఒలింపిక్స్‌లో ఆడేంత వరకు వదిలేలా లేరు, వాళ్లు మామూలోళ్లు కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 రిటైర్మెంట్‌ మీద రివర్స్ గేర్ వేసేంత వరకు అభిమానుల నుంచి రిక్వెస్ట్‌లు తగ్గేలా లేవని అంటున్నారు.


ఇవీ చదవండి:

ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు..

ఐసీసీ టోర్నీల్లో ఇండో-పాక్ ఫైట్ కష్టమే

ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని నెగ్గాలి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 25 , 2025 | 03:51 PM