IND vs ENG: ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. భారత్ పుట్టి ముంచిన కుర్ర పేసర్
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:30 PM
Saqib Mahmood: నాలుగో టీ20లో భారత్‌ను భయపెడుతున్నాడో కుర్ర పేసర్. స్టన్నింగ్ డెలివరీస్‌తో మెన్ ఇన్ బ్లూను షేక్ చేస్తున్నాడు. అతడి దెబ్బకు ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయింది సూర్య సేన.

అనుకున్నదే జరిగింది. నాలుగో టీ20లో టాస్ ఓడిన భారత్ టార్గెట్ సెట్ చేయడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. పేస్‌కు అనుకూలిస్తున్న పుణె పిచ్ మీద మనోళ్లు తడబడతారని భావిస్తే అదే జరిగింది. ఇంగ్లీష్ కొత్త బౌలర్ సకీబ్ మహమూద్ దెబ్బకు ఒకే ఓవర్‌లో ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది భారత్. అతడు వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు డిపెండబుల్ తిలక్ వర్మ కూడా ఔట్ అయ్యాడు.
వీక్‌నెస్ మీదే కొట్టాడు!
సంజూ శాంసన్‌ను అతడి బలహీనత మీద కొట్టి ఔట్ చేశాడు సకీబ్ మహమూద్. షార్ట్ పిచ్ డెలివరీస్ వలలో పడేలా చేసి.. పెవిలియన్‌కు దారి చూపించాడు. తిలక్‌ను తన పేస్ వెపన్‌తో పడేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను కూడా పక్కా ప్లాన్ వేసి ఔట్ చేశాడు. దీంతో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. ప్రస్తుతం 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 29 పరుగులతో ఉంది. రింకూ సింగ్ (5 నాటౌట్), అభిషేక్ శర్మ (21 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎంత ఎక్కువ సేపు ఆడతారనే దాని మీదే మన జట్టు భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. టీమిండియా కనీసం 150 మార్క్‌ను అందుకుంటుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
భార్య మాటలకు అశ్విన్ షాక్.. అతడ్ని ప్రేమిస్తున్నావా అని అడగడంతో..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి