Share News

Jasprit Bumrah: టీమ్ కంటే బుమ్రా గొప్పా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు!

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:22 PM

జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్ టూర్‌లో ఈ ఒక్కడి చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి. భారత జట్టుకు సంబంధించి బుమ్రా గురించి తప్ప మరో డిస్కషన్ టాపిక్ కనిపించడం లేదు.

Jasprit Bumrah: టీమ్ కంటే బుమ్రా గొప్పా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు!
Jasprit Bumrah

క్రికెట్ లాంటి టీమ్ స్పోర్ట్స్‌లో జట్టు గెలుపు కంటే ఏదీ ముఖ్యం కాదని అంటుంటారు. ఒక ప్లేయర్ వ్యక్తిగతంగా ఏం సాధించినా, ఎంత క్రేజ్ ఉన్నా ఆట తర్వాతే ఏదైనా అని చెబుతుంటారు. టీమిండియా లాంటి స్టార్ కల్చర్ ఉన్న జట్లు దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంటాయి. భారత ఆటగాళ్లను అభిమానులు డెమీగాడ్‌గా చూస్తుంటారు. వారికి ఏమైనా అయిందంటే తట్టుకోలేరు. అయితే ఇలాంటి పనుల వల్ల జట్టుకు నష్టమే తప్ప.. లాభం లేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీమ్ కంటే బుమ్రా తోపు కాదు కదా అని అంటున్నారు. అసలేం జరిగిందంటే..


ఎందుకు ఆడించరు?

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న బుమ్రా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో ఆడేది, లేనిది అనుమానంగా మారింది. గాయం బెడద ఉండటంతో లీడ్స్ టెస్ట్‌లో దాదాపుగా 50 ఓవర్లు వేసిన బుమ్రాను రెండో మ్యాచ్‌కు దూరంగా ఉంచాలని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. బుమ్రా ఫిట్‌గా ఉంటే ఆడిస్తామని.. సిరీస్‌లో 3 టెస్టులు మాత్రమే ఆడేందుకు వచ్చాడని టీమ్ మేనేజ్‌మెంట్ అంటోంది. అయితే ఆల్రెడీ మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత్.. రెండో టెస్ట్‌లో ఓడితే పరిస్థితి ఏంటి అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. మొదటి టెస్ట్, రెండో టెస్ట్‌కు మధ్య 8 రోజుల గ్యాప్ దొరికిందని.. అతడు ఫిట్‌గా ఉన్నా ఆడించకపోవడం ఏంటని సీరియస్ అవుతున్నారు.


ఆడించాల్సిందే..

సీనియర్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ‘బుమ్రా అందుబాటులో ఉన్నాడా? లేడా? ఒకవేళ అతడు ఆడేందుకు సిద్ధంగా ఉంటే అతడ్ని బరిలోకి దించాలి. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్య చాలా విరామం దొరికింది. తదుపరి రెండు మ్యాచుల మధ్య కూడా రెస్ట్ లభిస్తుంది. అందుకే అతడ్ని ఆడించాలి. రెండో టెస్ట్, నాలుగో టెస్ట్‌లో బుమ్రాను బరిలోకి దింపాలి. అతడు ఫిట్‌గా, అందుబాటులో ఉన్నప్పుడు కోచింగ్ స్టాఫ్ ఎందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’ అని ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. ఇది చూసిన నెటిజన్స్.. టీమ్ కంటే బుమ్రా గొప్ప కాదని అంటున్నారు. తొలి టెస్ట్‌లో ఓడినందున రెండో మ్యాచ్‌లో అతడ్ని పక్కా ఆడించాలని, అతడు రాణిస్తే టీమ్‌కు ఢోకా ఉండదని అంటున్నారు. బుమ్రాను ఆడించకపోతే డేంజర్ అని, రెండో మ్యాచ్ కూడా పోతే సిరీస్ సమర్పయామి అవుతుందని.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బ్యాటింగ్ చేతకాదు: అశ్విన్

స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

ఆ రోజే నా కెరీర్ క్లోజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 01:30 PM