Kane Williamson: కేన్ మామ కళ్లుచెదిరే క్యాచ్.. వీళ్ల ఫీల్డింగ్ కోచ్‌కో పెద్ద దండం
ABN , Publish Date - Mar 02 , 2025 | 06:52 PM
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఊహించిన విధంగానే చాలా ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. అయితే కివీస్ ఫీల్డర్లు మాత్రం అందరి కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశారు.

ప్రస్తుత క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు న్యూజిలాండ్‌ను చెబుతుంటారు. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి ఇతర బడా జట్లలోనూ మంచి ఫీల్డర్లు ఉన్నారు. కానీ కివీస్ ఆటగాళ్ల ఫీల్డింగ్ ఎఫర్ట్స్ ముందు ఇతర టాప్ టీమ్స్ దిగదుడుపేనని అంటుంటారు. ఇది మరోమారు ప్రూవ్ అయింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్‌లో అదరగొట్టింది. మైదానంలో పాదరసం కంటే వేగంగా కదులుతూ బంతిపై చిరుతల్లా దూకుతూ డామినేషన్ చూపించారు బ్లాక్‌క్యాప్స్. క్యాచులు పట్టడమే గాక గ్రౌండ్ ఫీల్డింగ్‌లోనూ ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ ఎఫర్ట్స్‌తో షాక్‌కు గురిచేశారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి తోపు ఫీల్డర్లను కూడా బిత్తరపోయేలా చేశారు.
సింగిల్ హ్యాండ్‌తో..
కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు. జడేజాను షాక్‌కు గురిచేశాడు. భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు విలియమ్సన్. ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ క్యాచే కాదు.. టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు ఇంకొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు. విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు. ఇది చూసి కోహ్లీ సహా గ్యాలరీలో ఉన్న అతడి సతీమణి అనుష్క శర్మ కూడా షాక్‌కు గురైంది. ఇలా ఫీల్డింగ్‌తో భారత్ భారీ స్కోరు చేయకుండా ఎక్కడికక్కడ బ్రేకులు వేసింది న్యూజిలాండ్. ఆ టీమ్ ఫీల్డింగ్ చూసిన నెటిజన్స్.. వీళ్ల ఫీల్డింగ్ కోచ్‌కో దండం అని అంటున్నారు. ఇలా కట్టడి చేస్తే ఇంక బ్యాటర్లు ఆడటం మానుకోవాల్సిందే అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
కోహ్లీ క్యాచ్.. అనుష్క షాక్.. వదినమ్మను బాధపెట్టారు కదరా..
అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు.. ఇది అస్సలు ఊహించలేదు గురూ
కోహ్లీనే బిత్తరపోయేలా చేశాడు.. వీడు మనిషా.. పక్షా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి