Share News

Gill-Ganguly: ఆ ఒక్క పని చేస్తే తిరుగుండదు.. గిల్‌కు గంగూలీ సూచన!

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:03 PM

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు రెండు కీలక సూచనలు చేశాడు దిగ్గజం సౌరవ్ గంగూలీ. భారత జట్టు నెగ్గాలంటే గిల్ ఆ రెండు పనులు చేయాల్సిందేనని అన్నాడు.

Gill-Ganguly: ఆ ఒక్క పని చేస్తే తిరుగుండదు.. గిల్‌కు గంగూలీ సూచన!
Shubman Gill

టీ20ల మాయ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న క్రికెట్ అభిమానులు.. ఇకపై సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచుల్ని చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు తెరలేవనుంది. త్వరలో భారత్-ఇంగ్లండ్ నడుమ 5 టెస్టుల సిరీస్ షురూ కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లీష్ గడ్డకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు జోరుగా సాధన చేస్తున్నారు. స్టోక్స్ సేన బెండు తీయాలని.. సొంతగడ్డ మీద వాళ్లను మట్టికరిపించాలని చూస్తున్నారు. ఈ తరుణంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒక్క పని గనుక చేసినట్లయితే టీమిండియాకు తిరుగుండదని, సిరీస్ మెన్ ఇన్ బ్లూకేనని అన్నాడు.


అప్పుడే ఆడించాలి..

బ్యాటింగ్ యూనిట్ కలసికట్టుగా రాణించడం, పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉండటం.. ఈ రెండూ టీమిండియాకు చాలా ముఖ్యమని గంగూలీ అన్నాడు. బుమ్రా ఫిట్‌గా ఉండి, బ్యాటర్లు అదరగొడితే భారత్‌కు ఎదురుండదని చెప్పాడు. ఈ రెండు విషయాలపై కెప్టెన్ గిల్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ ఎక్కువగా దృష్టి సారించాలని దాదా సూచించాడు. బుమ్రా టీమ్‌కు ప్రధాన ఆయుధమని, అయితే అతడితో సుదీర్ఘ స్పెల్స్ వేయించలేమని తెలిపాడు. వికెట్ టేకర్‌గా పరిగణించి అతడ్ని అవసరమైన సమయంలోనే రంగంలోకి దింపాలని సలహా ఇచ్చాడు దాదా.


అంతకుమించి నో బౌలింగ్..

‘బుమ్రా ఆడటం భారత్‌కు చాలా అవసరం. అతడ్ని ఫిట్‌గా ఉంచాలి. బుమ్రా సుదీర్ఘంగా బౌలింగ్ వేయడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గిల్ అర్థం చేసుకోవాలి. అతడ్ని వికెట్ టేకర్‌గా వాడుకోవాలి. ఒక రోజులో 12 ఓవర్లకు మించి అతడితో బౌలింగ్ చేయించకూడదు. ఇతర బౌలర్లతో దూకుడుగా బౌలింగ్ చేయించాలి. అవసరమైనప్పుడు మాత్రమే బుమ్రా చేతికి బంతిని ఇస్తూ అతడ్ని కాపాడుకోవాలి. అయితే పిచ్, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ సిరీస్‌లో ఇంగ్లండే ఫేవరెట్. కానీ బ్యాటర్లు రాణించి, బుమ్రా ఫిట్‌గా ఉంటే భారత్‌కు తిరుగుండదు. టీమిండియా గెలుస్తుందనే నమ్మకం ఉంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

ఆర్సీబీ ఆక్షన్ వీడియో లీక్!

డబ్ల్యూటీసీ ఫైనల్‌ డ్రా అయితే?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 12:03 PM