Share News

IND vs ENG: అభిషేక్‌ ఒక మెంటలోడు.. నితీష్ ఇలా అనేశాడేంటి

ABN , Publish Date - Feb 03 , 2025 | 09:35 AM

Abhishek Sharma Innings: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ షాట్లతో స్టేడియంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. దీంతో అతడిపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

IND vs ENG: అభిషేక్‌ ఒక మెంటలోడు.. నితీష్ ఇలా అనేశాడేంటి
Abhishek Sharma-Nitish Reddy

విధ్వంసం.. ఈ పేరుకు తాను కేరాఫ్ అడ్రస్ అని మరోమారు నిరూపించాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. గురువు యువరాజ్ సింగ్ మాదిరే తాను బిగ్ నాక్స్ ఆడే ప్లేయర్ అని ఇంకోసారి ప్రూవ్ చేశాడు. యువీలాగే ఇంగ్లండ్‌ లాంటి బిగ్ టీమ్స్ మీద కళ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు ఆడగలనని చూపించాడు. ఆ టీమ్‌తో వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన సండే ఫైట్‌లో అభిషేక్ శివతాండవం చేశాడు. 7 బౌండరీలు, 13 సిక్సులతో ప్రత్యర్థి మీద ఉరుములా పడ్డాడు. అపోజిషన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 54 బంతుల్లో 135 పరుగుల నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.


సలార్ అంటూ..

అభిషేక్ బ్యాటింగ్ అదరహో అంటూ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బ్యాటింగ్ న భూతో.. న భవిష్యత్ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ ఓపెనర్‌ ఆటతీరుపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. అభిషేక్ ఓ మెంటలోడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు నితీష్. అతడి బ్యాటింగ్ సూపర్బ్ అంటూ మెచ్చుకున్నాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిషేక్ శర్మను మెన్షన్ చేశాడు. ‘సలార్‌’ మూవీ క్లైమాక్స్‌లో రెబల్‌స్టార్ ప్రభాస్ కత్తితో ఉన్న ఫొటోతో పాటు కింద అభిషేక్ ఫొటోను యాడ్ చేశాడు నితీష్. దీనికి ‘మెంటల్ నా కొడుకు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.


కాటేరమ్మ కొడుకు పవర్!

అభిషేక్‌కు సెల్యూట్ అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఎమోజీ షేర్ చేశాడు నితీష్ రెడ్డి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. నిజంగానే అభిషేక్ మెంటలోడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఊచకోత, ఆ బాదుడు, ఆ ఊర మాస్ ఇన్నింగ్స్ ఏంట్రా బాబు అంటూ షాక్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అదీ ఇంగ్లండ్ లాంటి టీమ్ జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లాంటి బౌలింగ్ లైనప్‌పై ఇంతటి బీభత్సం అంటే మాటలా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది కాటేరమ్మ కొడుకుకు మాత్రమే సాధ్యమంటూ అభిషేక్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


ఇవీ చదవండి:

ఈ పగ చల్లారదు.. యువీతో ఆగలేదు.. అభిషేక్‌తో అంతమవదు

చరిత్ర సృష్టించిన అభిషేక్.. ఇది అన్‌బ్రేకబుల్ రికార్డ్

మనమ్మాయిల మరో ప్రపంచం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 10:40 AM