Share News

India versus Australia Match: ఒక్క వికెట్.. దద్దరిల్లిన స్టేడియం.. శబ్దానికి చెవులు పగలాల్సిందే

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:30 PM

Shubman Gill Catch: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క పనితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతడు పట్టిన క్యాచ్‌తో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.

India versus Australia Match: ఒక్క వికెట్.. దద్దరిల్లిన స్టేడియం.. శబ్దానికి చెవులు పగలాల్సిందే
IND vs AUS

సాధారణంగా మనుషులు వినగలిగే సౌండ్ 85 డెసిబల్స్. ఈ రేంజ్‌ కంటే ఎక్కువ శబ్దం వింటే చెవికి ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. 110 డెసిబల్స్‌కు మించిన సౌండ్ వింటే చెవి దెబ్బ తింటుందని వార్నింగ్ ఇస్తుంటారు. అలాంటిది ఒకేసారి 123 డెసిబల్స్ శబ్దం వింటే పరిస్థితి ఊహించుకోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కంగారూ ఓపెనర్, డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఔటైన సమయంలో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది.


ఒక్క వికెట్‌తో..

హెడ్ ఫుల్ ఫామ్‌లో ఉండటం, వరుసగా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడటంతో దుబాయ్ స్టేడియం నిశ్శబ్దంగా మారింది. భారత అభిమానులు సైలెంట్ అయిపోయారు. వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్ రిపీట్ అవుతోందని, రోహిత్ సేన పనైపోయిందని బాధపడసాగారు. కానీ ఒక్క బంతితో అంతా మారిపోయింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వచ్చీ రాగానే చక్కటి బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. అతడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు హెడ్. దీంతో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. ఔట్.. మీ ఖేల్ ఖతం అంటూ ఆసీస్‌ను ఉద్దేశించి అరవసాగారు. ఈలలు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. ఈ టైమ్‌లో సౌండ్ మీటర్‌లో శబ్దం 123 డెసిబల్స్‌గా నమోదైంది.


ఇవీ చదవండి:

క్యాచ్ కాదు.. కప్పు పట్టేశాడు

రాక్షసుడి ఆటకట్టు.. రివేంజ్ తీర్చుకున్న టీమిండియా

టాస్ ఓడిన రోహిత్.. మ్యాచ్ మనదే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2025 | 04:33 PM