IND vs AUS: రాక్షసుడి ఆటకట్టు.. రివేంజ్ తీర్చుకున్న టీమిండియా
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:47 PM
Varun Chakaravarthy: ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టే రాక్షసుడ్ని భారత జట్టు సాగనంపింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అతడి ఆట కట్టించాడు.

తొలి బంతి నుంచే విరుచుకు పడుతూ చూస్తుండగానే రిజల్ట్‌ను తారుమారు చేసే రాక్షసుడి ఆట కట్టించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో టీమిండియా అదరగొడుతోంది. 54 పరుగులకే ఇద్దరు కంగారూ బ్యాటర్లను వెనక్కి పంపి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలుత కొనొల్లీని వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఔట్ చేయగా.. ఆ తర్వాత డేంజరస్ ట్రావిస్ హెడ్‌ను వరుణ్ వెనక్కి పంపించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేసిన హెడ్.. భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతుండగా అతడికి బ్రేక్ వేశాడు వరుణ్. అతడి ఔట్‌తో టీమిండియాలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. స్టేడియంలోని భారత అభిమానులు కూడా ఈ వికెట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇవీ చదవండి:
టాస్ ఓడిన రోహిత్.. మ్యాచ్ మనదే
దుబాయ్ పిచ్ రిపోర్ట్.. ఎవరికి బెనిఫిట్
ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి