Shubman Gill Catch: గిల్ చేసింది తప్పా.. ఈ క్యాచ్ కరెక్టేనా.. ఇంతకీ అంపైర్ ఏం చేస్తున్నట్లు..
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:58 PM
Shubman Gill Catch: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క పనితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతడు పట్టిన క్యాచ్‌తో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ కంగారూల జోరుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. వేగంగా పరుగులు చేయకుండా నిరోధిస్తున్నారు. ఆరంభంలోనే వెటరన్ పేసర్ మహ్మద్ షమి వికెట్ తీసి భారత్‌కు సాలిడ్ స్టార్ట్ అందించాడు. కుర్ర బ్యాటర్ కొనొల్లీని ఔట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపాడు. ఆ తర్వాత ప్రమాదకర ట్రావిస్ హెడ్ (39)ని వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపించాడు. అయితే హెడ్ క్యాచ్‌ను గిల్ అందుకున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు.. హెడ్ నాటౌట్ అంటూ కొందరు పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. మరి.. నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం..
అలా చేయడం తప్పా..
హెడ్ స్ట్రయిట్ వికెట్ మీదుగా కొట్టిన బంతిని లాంగాఫ్‌లో ఉన్న గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి చాకచక్యంగా అందుకున్నాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. హెడ్ పెవిలియన్‌కు చేరడం, అతడి స్థానంలో మరో బ్యాటర్ వచ్చి మ్యాచ్ కంటిన్యూ అయింది. అయితే గిల్ క్యాచ్ అందుకున్నాక ఒక్క సెకన్ కూడా బాల్‌ను చేతిలో హోల్డ్ చేయలేదు. దీంతో పట్టిన వెంటనే అలా పడేస్తే నాటౌట్ అంటూ చర్చకు దారితీసింది. కొద్దిసేపటికే అంపైర్ కూడా గిల్‌ను పిలిచి అలా పడేయొద్దు.. బాల్ మీద నియంత్రణ రావాలి, అందుకొని కొద్ది సేపయ్యాకే వదలాలంటూ వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై రూల్స్ ఏం చెబుతున్నాయి? అసలు క్యాచ్ పట్టాక బాల్‌ను పడేస్తే ఔటా? బంతిని ఎంత సేపు హోల్డ్ చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రూల్స్ ఏం చెబుతున్నాయి..
క్యాచ్ అందుకున్నాక బంతిని ఫలానా సమయం పట్టుకొని ఉండాలని క్రికెట్‌లో రూల్ ఏమీ లేదు. ఇంత సేపు పట్టుకోవాలనే టైమ్ లిమిట్ లేదు. కానీ క్యాచ్ పట్టాక బాల్‌ను పర్ఫెక్ట్‌గా హోల్డ్ చేయాలి. దాని మీద పూర్తి నియంత్రణ ఉన్నట్లు కనిపించాలి. అదే సమయంలో బంతి నేలను తాకకుండా చూసుకోవాలి. అలాగే అది చేతుల్లో బౌన్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ చేతుల్లో బౌన్స్ అయితే మళ్లీ దాన్ని పట్టుకొని కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత కింద పడేసి సెలబ్రేషన్ చేసుకున్నా ఏమీ కాదు. బంతిని అందుకున్నాక తడబడినట్లు అనిపిస్తే ఔట్ ఇవ్వరు. తడబడినట్లు చేసి కవర్ చేసేందుకు సెలబ్రేషన్ చేసుకున్నా బంతి చేజారినట్లుగానే భావించి నాటౌట్‌గా ప్రకటిస్తారు. అందుకే గిల్‌ను పిలిచి ఈ విషయం గురించి క్లారిటీగా చెప్పాడు అంపైర్. కాబట్టి ఈ కాంట్రవర్సీలో ఆయన తప్పేం లేదని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
ఒక్క వికెట్.. దద్దరిల్లిన స్టేడియం
టాస్ ఓడిన రోహిత్.. మ్యాచ్ మనదే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి