IPL 2025: ఐపీఎల్ ఆరంభానికి ముందే ఐదుగురు స్టార్లు దూరం.. ఎవరెవరంటే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 09:46 AM
Harry Brook: ఐపీఎల్ ఆరంభానికి ముందే ఐదుగురు స్టార్లు తప్పుకున్నారు. దీంతో వాళ్ల ఆట చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు షాక్ తగిలింది. వాళ్లు దూరమవడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మరో మూడ్రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ నయా ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో అన్ని జట్లు ప్రిపరేషన్స్‌లో మరింత వేగం పెంచాయి. ఒకవైపు సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు వ్యూహ రచనలోనూ తలమునకలు అవుతున్నాయి. అయితే అనూహ్యంగా కొంత మంది కీలక ఆటగాళ్లు తప్పుకోవడం ఫ్రాంచైజీల పాలిట శాపంగా మారుతోంది. కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్లు సరిగ్గా సీజన్ ఆరంభానికి ముందు వైదొలగడంతో టీమ్ కాంబినేషన్స్ పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025కి దూరమవుతున్న ఆ ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
హ్యారీ బ్రూక్
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌లో ఆడటం లేదు. ఇంగ్లండ్ జట్టు భవిష్యత్ సిరీస్‌ల దృష్ట్యా క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడొద్దని అతడు డిసైడ్ అయ్యాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం గాయం లేదా కుటుంబ సమస్య కాకుండా ఇతర రీజన్స్‌ను సాకుగా చూపి టోర్నమెంట్‌కు దూరమైతే 2 ఏళ్ల పాటు బ్యాన్ విధిస్తారు. ఇప్పుడు బ్రూక్ నిషేధం అంచున ఉన్నాడు.
బ్రైడన్ కార్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ కార్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కార్స్ ఎడమ కాలి బొటనవేలికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.
లిజాడ్ విలియమ్స్
ముంబై ఇండియన్స్ పేసర్ లిజాడ్ విలియమ్స్ కూడా ఇంజ్యురీ కారణంగానే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఆక్షన్‌లో రూ.75 లక్షలు పలికిన ఈ స్పీడ్‌స్టర్ ప్లేస్‌లో సౌతాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్‌ను టీమ్‌లోకి తీసుకుంది ముంబై.
ఉమ్రాన్ మాలిక్
కేకేఆర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ కూడా క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్‌కు దూరమయ్యాడు. అతడు కూడా గాయం కారణంగానే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో మరో పేసర్ చేతన్ సకారియాను రీప్లేస్ చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్.
అల్లా ఘజన్‌ఫర్
ముంబై ఇండియన్స్‌కు చెందిన మరో ఆటగాడు కూడా సీజన్ ఆరంభానికి ముందు తప్పుకున్నాడు. అతడే స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్. వేలంలో రూ.4.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టీమ్‌కు దూరమయ్యాడు ఘజన్‌ఫర్. దీంతో అతడి స్థానంలో మరో ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్‌ను తీసుకుంది ఎంఐ.
ఇవీ చదవండి:
కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ
ఎండ వేడిమికి తాళలేక పిచ్‌పైనే..
మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి