Hardik Pandya: నన్ను నడిపించేది ఆయనే.. సీక్రెట్ రివీల్ చేసిన హార్దిక్
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:23 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో సెమీస్‌కు క్వాలిఫై అయింది. ఇదే జోరులో కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి జోరు మీదున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ కాంట్రిబ్యూషన్ అందిస్తూ టీమ్‌కు తురుపుముక్కగా మారాడు. గతేడాది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో మేజర్ రోల్ పోషించిన పాండ్యా.. ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలోనూ మెన్ ఇన్ బ్లూను చాంపియన్‌ను చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అలాంటోడు తన సక్సెస్ సీక్రెట్‌తో పాటు డైలీ రొటీన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పాండ్యా ఏం అన్నాడంటే..
రోజులో 7 సార్లు..
పొద్దున లేవగానే హనుమాన్ చాలీసా వింటానని హార్దిక్ అన్నాడు. ఆంజనేయుడే తనను నడిపిస్తున్నాడని చెప్పాడు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తాను రోజును ఆరంభిస్తానని.. కనీసం 7 సార్లు హనుమాన్ చాలీసాను వింటానని తెలిపాడు. ఆ తర్వాత ఐస్ వాటర్‌తో స్నానం చేస్తానని.. ఫ్రెషప్ అయ్యాక గంట పాటు యోగా చేస్తానని పేర్కొన్నాడు పాండ్యా. యోగా సెషన్ ముగిశాక గంటన్నర పాటు జిమ్ చేసి.. చివరగా కాసేపు ధ్యానం సాధన చేస్తానన్నాడు.
ఫ్యామిలీ టైమ్
ఫిట్‌నెస్ సెషన్స్ ముగిశాక 45 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటాడట హార్దిక్. ఆ తర్వాత లంచ్ చేస్తాడట. అది ముగిశాక కుటుంబ సభ్యులు, పిల్లలతో చాలా సేపు గడుపుతాడట. టీవీ చూస్తూ, కుక్కులతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడట. లంచ్ తర్వాత గంట సేపు నిద్రపోవడం తనకు అలవాటు అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సాయంత్రం మరో రెండున్నర గంటల పాటు వర్కౌట్ సెషన్ ఉంటుందని.. ఇది తన డైలీ రొటీన్ అని అతడు షేర్ చేశాడు. రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగొచ్చి కాసేపు పుస్తకాలు చదువుతూ, జర్నల్స్ రాస్తూ గడుపుతాడట హార్దిక్. మ్యాచులు లేని సమయంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ రొటీన్ ఫాలో అవుతానని వివరించాడు. నైట్ 9.30 గంటలకు ఠంచనుగా నిద్రపోతానని రివీల్ చేశాడు. క్రమశిక్షణ, వర్కౌట్స్, దైవ ధ్యానం.. తన జర్నీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇదే తన సీక్రెట్ అన్నాడు.
ఇవీ చదవండి:
చాంపియన్స్ ట్రోఫీ.. 100 మంది పోలీసులపై వేటు
52 ఏళ్ల వయసులోనూ సచిన్ రప్పా రప్పా
నేను టీమిండియాను తప్పుపట్టలేదు: ప్యాట్ కమిన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి