Hardik Pandya: యుద్ధభూమిని వీడొద్దు.. హార్దిక్ మాటలు వింటే గూస్‌బంప్సే
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:38 PM
IPL 2025: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్‌లో దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నాడు హార్దిక్ పాండ్యా. బ్యాటర్‌గానే కాదు.. సారథిగానూ సత్తా చాటాలని చూస్తున్నాడు.

టీమిండియా స్టైలిష్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్‌లో ఒక్క ఏడాదిలో ఊహించని మార్పు వచ్చింది. గతేడాది ఐపీఎల్ సమయంలో అతడ్ని బూ.. అంటూ ఎగతాళి చేశారు అభిమానులు. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారడం, రోహిత్ శర్మను తీసేసి అతడికి సారథ్యం ఇవ్వడం చాలా మంది ఫ్యాన్స్‌కు రుచించలేదు. దీంతో పాండ్యాను ట్రోల్ చేశారు. అయితే అటు టీ20 వరల్డ్ కప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ టీమ్‌లో కీలకపాత్ర పోషించి తిరిగి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు హార్దిక్. ఈ నేపథ్యంలో యుద్ధభూమిని వీడొద్దంటూ అతడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఇంకా ఏమన్నాడంటే..
అదే నా సిద్ధాంతం: పాండ్యా
యుద్ధభూమిని ఎల్లప్పుడూ వీడొద్దనేది నా ఫిలాసఫీ. విజయం ఒక్కటే కాకుండా టీమ్‌లో నా బెర్త్‌ను కాపాడుకోవడం.. ప్లేస్‌ను నిలబెట్టుకోవడం లాంటి ఎన్నో ఫేజెస్‌ను కెరీర్‌లో చూశా. నా జీవితంతో పాటు కెరీర్‌లోనూ ఎన్నో విషయాలు జరుగుతున్నా నేను మాత్రం క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టా. ఈ ఆటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం చేసుకున్నా. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా, అవాంతరాలు ఇబ్బంది పెట్టినా, సమస్యలు కుంగదీసినా వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నా. ఆఖరుకు అనుకున్న ప్రతిఫలం వచ్చింది. వరల్డ్ కప్ నెగ్గిన ఈ ఆరు నెలల్లో ఫ్యాన్స్ నుంచి దొరికిన లవ్, సపోర్ట్‌కు నా కృతజ్ఞతలు. వాళ్ల ప్రేమకు ధన్యుడ్ని. నా మీద అభిమానులు ఇలాగే లవ్ చూపించాలని కోరుకుంటున్నా.
ఇవీ చదవండి:
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
ఐపీఎల్ కెప్టెన్లకు బీసీసీఐ హుకుం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి