Sanju Samson: సంజూకు బీసీసీఐ షాక్.. అసలే ఓటమి బాధలో ఉంటే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:26 AM
IPL 2025: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. పడుతూ లేస్తూ పోతోంది సంజూ సేన. వరుసగా రెండు గెలుపులతో గాడిన పడినట్లే కనిపించిన రాజస్థాన్.. గుజరాత్ టైటాన్స్ చేతుల్లో అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆర్ఆర్ క్యాంప్ నిరాశలో మునిగిపోయింది. ఈ తరుణంలో ఆ జట్టు సారథి సంజూ శాంసన్‌కు గట్టి షాక్ తగిలింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
సంజూతో పాటు వాళ్లకూ..
సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో స్లో ఓవర్ రేట్ కింద అతడికి ఫైన్ వేసింది భారత బోర్డు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇలా జరిమానా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. సీజన్ ఆరంభంలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇలాగే స్లో ఓవర్ రేట్ కింద రూ.12 లక్షలు జరిమానా విధించింది బీసీసీఐ. అయినా మార్పు రాకపోవడం, జీటీతో మ్యాచ్‌లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు కంప్లీట్ చేయకపోవడంతో ఈసారి సారథి శాంసన్‌తో పాటు మొత్తం రాజస్థాన్ టీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోని ఆటగాళ్లందరికీ రూ.6 లక్షల చొప్పున ఫైన్ వేసింది బీసీసీఐ. రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 25 శాతం ఫైన్ కట్టాల్సిందిగా ఆదేశించింది. అసలే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్‌కు ఇది బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి