Share News

Gambhir-Bumrah: గంభీర్‌ను భయపెడుతున్న బుమ్రా .. టీమిండియాలో నయా పవర్ గేమ్

ABN , Publish Date - May 15 , 2025 | 01:41 PM

Team India: భారత జట్టులో పవర్ గేమ్ స్టార్ట్ అయింది. టీమ్‌పై పట్టు కోసం కోచింగ్ స్టాఫ్ నుంచి కొత్త కెప్టెన్ వరకు అందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్, సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య పవర్ గేమ్ నడుస్తోందని వినిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Gambhir-Bumrah: గంభీర్‌ను భయపెడుతున్న బుమ్రా .. టీమిండియాలో నయా పవర్ గేమ్
Gambhir-Bumrah

భారత క్రికెట్‌లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో విఫలమవడంతో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో కొత్త సారథిని నియమించే పనుల్లో బిజీగా ఉంది భారత క్రికెట్ బోర్డు. అయితే సీనియర్లు లేకపోవడంతో ఇప్పుడు టీమిండియాలో పవర్ గేమ్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. జట్టుపై పట్టు కోసం హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఫైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రసవత్తర ఆటలో ఎవరు ముందంజలో ఉన్నారు.. బీసీసీఐ సపోర్ట్ ఎవరికి.. అనేది ఇప్పుడు చూద్దాం..


పెత్తనం ఎవరిదో..

టీమిండియాపై పట్టు కోసం తనకు నచ్చిన ఆటగాడ్ని కొత్త సారథిగా నియమించాలని గంభీర్ చూస్తున్నాడట. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లో ఒకరికి పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా తన మాట జవదాటని గిల్‌ను ఆ పోస్ట్‌కు తీసుకోవాలని గౌతీ భావిస్తున్నాడట. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలని బీసీసీఐని అతడు కోరాడని సమాచారం. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గౌతీకే మద్దతు తెలిపాడట. అయితే బోర్డులోని కొందరు పెద్దలు మాత్రం బుమ్రా వైపు మొగ్గు చూపుతున్నారని వినిపిస్తోంది. మ్యాచ్ విన్నర్, సీనియర్ పేసర్ అయిన బుమ్రాకు పగ్గాలు అప్పజెబితే జట్టు అధికారాల విషయంలో సమతూకం వస్తుందని.. అలా చేయకపోతే గంభీర్ పెత్తనం నడవడం ఖాయమని భయపడుతున్నారట.


బీసీసీఐ ఎటువైపు..

బుమ్రా కెప్టెన్ అయితే తన మాట వినడని గంభీర్ టెన్షన్ పడుతున్నాడని తెలుస్తోంది. అతడికి బదులు గిల్‌ను సారథిని చేస్తే టీమ్ అంతా తన కనుసన్నల్లోనే నడుస్తుందనేది అతడి ప్లాన్ అని వినిపిస్తోంది. బుమ్రాకు ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అతడి కంటే గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడమే సరైనదని బీసీసీఐ పెద్దలకు నచ్చజెప్పినట్లు సమాచారం. దీనికి బోర్డు ఒప్పుకుంటే గిల్ సారథి అవ్వొచ్చు. అలా కాదని బుమ్రాకు పగ్గాలు అప్పజెబితే మాత్రం పవర్ అంతా అతడి చేతుల్లోనే ఉంటుందని, జస్‌ప్రీత్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్లేయర్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి.. ఈ పవర్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో కొన్ని రోజుల్లో తేలిపోతుంది.


ఇవీ చదవండి:

ఐపీఎల్‌ మిస్ కానున్న స్టార్లు వీళ్లే..

కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో..

ఈ రుణం తీర్చుకోలేనిది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2025 | 02:00 PM