Champions Trophy 2025: బ్లూ ప్రింట్ రెడీ చేసిన మోర్కెల్.. టీమిండియాకు ఇక తిరుగులేదు
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:00 PM
India vs Australia: టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మనకు కప్పుకు మధ్య ఏదైనా అడ్డుగా ఉందంటే అది ఆస్ట్రేలియా జట్టు మాత్రమే. అయితే దాని కోసం బ్లూ ప్రింట్‌ను రెడీ చేశారు కోచింగ్ స్టాఫ్.

చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అన్‌స్టాబుల్‌గా దూసుకెళ్తోంది. ఎదురొచ్చిన ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా మడతబెట్టేస్తోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. మలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ బెండు తీసింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పటిష్ట న్యూజిలాండ్‌ను అలవోకగా మట్టికరిపించింది. ఈ జోష్‌లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్‌కు సిద్ధమవుతోంది. ఇంకొద్ది సేపట్లో ఈ రెండు హేమాహేమీల మధ్య కీలక ఫైట్ జరగబోతోంది. గెలిస్తే ఫైనల్స్ బెర్త్ ఖాయం అవుతుంది కాబట్టి రెండు టీమ్స్ నువ్వానేనా అంటూ ఆఖరి వరకు పోరాడటం పక్కా. ఈ తరుణంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ తయారు చేసిన బ్లూ ప్రింట్ బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఆయుధం సిద్ధం
ఆసీస్ మీదకు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని గట్టిగా వదలాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతడితో బౌలింగ్ చేయించి హెడ్, ఇంగ్లిస్ లాంటి డేంజర్ బ్యాటర్లను వెనక్కి పంపాలని భావిస్తోందట. కంగారూలను ఈ స్కెచ్‌తో గట్టిగా బిగించాలని హెడ్ కోచ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఇద్దరూ ప్లాన్ చేశారట. ఈ తరుణంలోనే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వరుణ్‌పై మోర్కెల్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్న వీడియో బయటకు వచ్చింది.
మన ప్లాన్ తెలుసుగా: మోర్కెల్
‘ఎలా ఆడాలో మీకు తెలుసు. ఈ పిచ్ మీద బౌలింగ్‌లో మన బ్లూ ప్రింట్ ఏంటో ఆటగాళ్లందరికీ మంచి ఐడియా ఉంది. అద్భుతంగా బౌలింగ్ చేశారు. వికెట్లు తీసిన విధానం, ప్రత్యర్థిని ఇరుకున పెట్టిన తీరు, మిడిల్ ఓవర్లలో డాట్స్ వేసిన పద్ధతి బాగుంది. వరుణ్ తనకు దొరికిన చాన్స్‌ను రెండు చేతులా ఒడిసిపట్టాడు. అతడి విషయంలో సంతోషంగా ఉన్నా’ అని మోర్కెల్ చెబుతున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ దుబాయ్ పిచ్‌ను భారత్ ఒంటపట్టించుకుందని, బ్లూ ప్రింట్ రెడీ చేసి ప్లానింగ్‌తో అటాక్ చేస్తున్నారని అంటున్నారు.
ఇవీ చదవండి:
దుబాయ్ పిచ్ రిపోర్ట్.. ఎవరికి బెనిఫిట్
ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు
ఆకలితో ఉన్న సింహాన్ని రెచ్చగొడుతున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి