Gill-Gambhir Criticism: అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా..! ఆ నోళ్లు ఎందుకు మూతబడ్డాయి?
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:31 PM
టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై పెద్ద పెట్టున విమర్శలు వచ్చాయి. సుదీర్ఘ ఫార్మాట్‌కు గంభీర్ కోచ్‌గా పనికిరాడని.. అతడి కోచింగ్‌లో టెస్టుల్లో అపజయాలే తప్ప సాధించిందేమీ లేదనే కామెంట్స్ వినిపించాయి. యువ సారథి శుబ్‌మన్ గిల్ టీమ్‌ను సమర్థంగా నడిపించలేడని.. అతడి స్థానంలో మరో సీనియర్ ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్స్ వచ్చాయి. అయితే వీటన్నింటికీ ఒకే ఒక్క మ్యాచ్‌తో సాలిడ్ ఆన్సర్స్ దొరికాయి. ఒక్క విజయంతో విమర్శించిన నోళ్లు అన్నీ మూసుకుపోయాయి.
రెండింటా తిరుగులేదు..
రెండో టెస్ట్‌లో కెప్టెన్ గిల్ చెలరేగి ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగుల ధనాధన్ నాక్స్‌తో అదరగొట్టాడు. ఓవర్సీస్‌లో పరుగులు చేయలేడనే అపవాదుకు రెండు టెస్టులతో స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు గిల్. అలాగే కెప్టెన్సీ ఒత్తిడిని బ్యాటింగ్‌లో చూపించనని పెర్ఫార్మెన్స్ ద్వారా క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. బౌలర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, వారికి నచ్చినట్లు ఫీల్డింగ్ సెట్ చేస్తూ కావాల్సిన ఫలితం రాబట్టాడు. తద్వారా కెప్టెన్‌గానూ తనకు తిరుగులేదని అతడు నిరూపించుకున్నాడు.
పక్కా ప్లానింగ్‌తో..
గంభీర్ కూడా కోచింగ్‌లో తాను తక్కువ కాదని.. ఇతర ఫార్మాట్లలాగే టెస్టుల్లోనూ తాను సక్సెస్ అవుతానని చెప్పకనే చెప్పేశాడు. కెప్టెన్ గిల్‌తో కలసి అతడు పన్నిన వ్యూహాలు అన్నీ విజయవంతం అయ్యాయి. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక దగ్గర నుంచి బౌలింగ్ చేంజెస్, ఫీల్డింగ్ పొజిషన్స్, బ్యాటింగ్ ఆర్డర్.. ఇలా ప్రతి దాంట్లో గిల్‌తో కలసి అతడు చేసిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ అదిరిపోయాయి. దీంతో ఇన్నాళ్లూ వీళ్లను తిట్టిన విమర్శకులు ఇప్పుడు ఎటు పోయారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓడినప్పుడు తిట్టారని.. ఇప్పుడు గెలిచారు కాబట్టి ప్రశంసించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
గిల్ సేనను చూసి జడుసుకున్న కమిన్స్
ఆకాశ్‌దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!
మమ్మల్ని అతడే ఓడించాడు: మెకల్లమ్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి