Dhanashree Verma: ఆ నరకం నుంచి బయటపడ్డా.. చాహల్ భార్య సంచలన పోస్ట్
ABN , Publish Date - Feb 21 , 2025 | 01:26 PM
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఆట కంటే వ్యక్తిగత జీవితంలోని విషయాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సతీమణి ధనశ్రీ వర్మకు విడాకులు ఇస్తున్నాడంటూ న్యూస్ చక్కర్లు కొట్టడం తెలిసిందే.

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దంపతులు విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా జోరుగా పుకార్లు వస్తున్నాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్‌ఫాలో చేయడం, ఫొటోలు డిలీట్ చేయడం, బయట పార్టీల్లోనూ కలసి కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకుంటున్నారనే రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. తాజాగా వీరికి విడాకులు మంజూరైనట్లు సమాచారం. ఈ మేరకు ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ధనశ్రీ పెట్టి ఓ పోస్ట్ డివోర్స్ వార్తలను బలపర్చేలా ఉంది. ఆ నరకం నుంచి విముక్తి లభించిందంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.
దేవుడు మార్చేస్తాడు!
‘మనం పడే బాధలు, ఎదుర్కొనే సవాళ్లు, పరీక్షలను కొంతకాలం అనంతరం ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. ఏదైనా విషయంలో ఒత్తిడి, ఆందోళన చెందితే.. తప్పకుండా మరో చాన్స్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బాధలను మర్చిపోండి. దేవుడ్ని ప్రార్థిస్తూ ఉండండి. భగవంతుడి మీద మీకున్న నమ్మకమే మీకంతా శుభం జరిగేలా చేస్తుంది’ అని ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఒత్తిడి అనుభవించడం దగ్గర నుంచి దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మలచడం వరకు అనే అర్థం వచ్చేలా ఆమె క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
45 నిమిషాల పాటు కౌన్సెలింగ్!
విడాకుల వార్తల నేపథ్యంలో చాహల్ కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘ఆ భగవంతుడు నన్ను లెక్కలేనన్ని సార్లు కాపాడాడు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను గుర్తించేలోపే అందులో నుంచి నన్ను బయటపడేశాడు. ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్న దేవుడుకి కృతజ్ఞతలు’ అని చాహల్ రాసుకొచ్చాడు. దీంతో డివోర్స్ మంజూరైనట్లు వస్తున్న న్యూస్ నిజమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కాగా, విడాకుల కేసుపై ముంబై కోర్టులో గురువారం తుది విచారణ జరిగిందని తెలుస్తోంది. దీనికి చాహల్-ధనశ్రీ హాజరయ్యారని సమాచారం. 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ సెషన్ జరిగిందని, అయినా విడిపోవడానికి డిసైడ్ అవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసిందని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి