Share News

Ellyse Perry: పక్షిలా ఎగిరి పట్టేసింది.. విమెన్స్ క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్ చూసుండరు

ABN , Publish Date - Mar 02 , 2025 | 02:45 PM

WPL 2025: విమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రమంగా తుదిదశకు చేరుకుంటోంది. సెమీస్‌కు చేరే జట్లపై మెళ్లిగా క్లారిటీ వస్తోంది. ఈసారి నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.

Ellyse Perry: పక్షిలా ఎగిరి పట్టేసింది.. విమెన్స్ క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్ చూసుండరు
WPL 2025

మహిళల క్రికెట్‌లో ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రమాణాలు బాగా పెరిగాయి. మెన్స్ క్రికెట్‌ స్థాయిలో కాకపోయినా భారీగానే ఆదరణ దక్కుతుండటంతో బోర్డులు కూడా విమెన్స్ క్రికెట్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నాయి. ఆటగాళ్ల శిక్షణ దగ్గర నుంచి రెమ్యూనరేషన్ వరకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నాయి. ప్రతిభ కలిగిన ప్లేయర్ల జాడపట్టి ఎంకరేజ్ చేస్తున్నాయి. దీంతో మెరికల్లాంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే మహిళా క్రికెట్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ స్టాండర్డ్స్ చూసుకున్నా మెన్స్ క్రికెట్‌తో పోటీపడే స్థాయికి చేరుకున్నాయి. అందుకు విమెన్స్ ప్రీమియర్ లీగ్ బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఈ టోర్నమెంట్‌లో మహిళా క్రికెటర్లు చేసే స్టంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.


అమాంతం గాల్లోకి ఎగిరి..

డబ్ల్యూపీఎల్-2025లో ఓ స్టార్ ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విమెన్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విమెన్ టీమ్స్ మధ్య జరిగిన ఫైట్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండ్ ఎలిస్ పెర్రీ కళ్లుచెదిరే రీతిలో ఓ క్యాచ్ అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. రేణుకా బౌలింగ్‌లో డీసీ సారథి మెక్ లానింగ్ కొట్టిన బంతిని గాల్లో పక్షిలా ఎగురుతూ పట్టేసింది పెర్రీ. బంతి తన కంటే ఎక్కువ ఎత్తులో వస్తుండటంతో ముందే అంచనా వేసి చేతుల్ని పైకి తీసుకెళ్లిన పెర్రీ.. అది సమీపించగానే అమాంతం గాల్లోకి ఎగిరి పర్ఫెక్ట్ టైమింగ్‌తో పట్టేసింది. ఆ తర్వాత బాడీని బ్యాలెన్స్ చేస్తూ కిందకు ల్యాండ్ అయింది. ఆర్సీబీ ఓడిపోయినా గానీ ఈ క్యాచ్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. పెర్రీ క్యాచ్ వీడియో చూసిన నెటిజన్స్.. మహిళల క్రికెట్‌లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

నా టార్గెట్ అదే: కోహ్లీ

పదకొండోసారి ప్రపంచ రికార్డు

జట్లన్నీ దుబాయ్‌లోనే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2025 | 02:50 PM