MS Dhoni Record: మ్యాచ్‌కు ముందే ధోని రికార్డ్.. దీన్ని కొట్టేటోడే లేడు
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:35 PM
IPL 2025: మహేంద్ర సింగ్ ధోని కీలక మ్యాచ్‌కు ముందు కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే చరిత్ర సృష్టించాడు మాహీ. దాని గురించి మరింతగా తెలుసుకుందాం..

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి రికార్డులు కొత్తేమీ కాదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతడు చూడని విజయం లేదు, అందుకోని కప్పూ లేదు. అలాగే ఎన్నో అరుదైన మైలురాళ్లను తన పేరు మీద లిఖించుకున్నాడీ దిగ్గజ ఆటగాడు. ఐపీఎల్‌లోనూ ధోని చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. అతడు బరిలోకి దిగితే ఏదో ఒక రికార్డుకు మూడటం ఖాయం. అలాంటి మాహీ చాన్నాళ్ల తర్వాత కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు. సీఎస్‌కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో వైదొలగడంతో అతడి స్థానంలో చార్జ్ తీసుకున్నాడు మాహీ. అయితే సారథిగా ఆడే మ్యాచ్‌కు ముందే ధోని చరిత్ర సృష్టించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఒకే ఒక్కడిగా..
ఐపీఎల్ హిస్టరీలో ఓల్డెస్ట్ కెప్టెన్‌గా ధోని రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక వయసులో సారథ్యం వహించిన ఆటగాడిగా నిలిచాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నైకి సారథ్యం వహిస్తున్నాడు ధోని. ఇవాళ్టికి అతడి వయసు 43 ఏళ్ల 278 రోజులు. ఈ ఏజ్‌లో ఐపీఎల్‌లో ఎవరూ కెప్టెన్సీ చేయలేదు. ఆ రకంగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు మాహీ. ఇక మ్యాచ్ స్టార్ట్ అయి.. ముందుకు వెళ్తున్న కొద్దీ అతడు ఇంకెన్ని రేర్ ఫీట్స్ నమోదు చేస్తాడో చూడాలి. కాగా, సీఎస్‌కే-కేకేఆర్ మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ టీమ్ ఎంత టార్గెట్ సెట్ చేస్తుంది.. దాన్ని కేకేఆర్ ఎలా చేజ్ చేస్తుందనేది చూడాలి.
ఇవీ చదవండి:
సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్.. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్లదే
క్రికెట్‌లో కొత్త రూల్.. బ్యాటర్లకే వణుకే
ప్లేయింగ్ 11తో అల్లాడిస్తున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి