Share News

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు గట్టి షాక్.. అసలైనోడే దూరం

ABN , Publish Date - Feb 16 , 2025 | 02:05 PM

Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. అసలైనోడే జట్టుకు దూరమయ్యాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు గట్టి షాక్.. అసలైనోడే దూరం
Team India

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధం అవుతోంది భారత జట్టు. మరో మూడ్రోజుల్లో మెగా టోర్నీ మొదలు కానుండటంతో టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న రోహిత్ సేన.. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతోంది. మరో ఐసీసీ కప్పును ఎగరేసుకుపోవాలని చూస్తోంది. రోహిత్-కోహ్లీకి మరో ట్రోఫీని బహుమతిగా ఇవ్వాలని ఆటగాళ్లంతా కసి మీద ఉన్నారు. ఈ తరుణంలో జట్టుకు ఊహించలేని షాక్ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఇలా అయిందేంటి?

యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు గాయమైంది. చీలమండ గాయంతో బాధపడుతున్న కుర్ర బ్యాటర్.. ఈ కారణంగా రంజీ ట్రోఫీ సెమీఫైనల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కూడా అనుమానంగా మారింది. ఆ టోర్నమెంట్‌కు ప్రకటించిన స్క్వాడ్‌లో జైస్వాల్ లేడు. కానీ ట్రావెలింగ్ రిజర్వ్స్‌లో ఒకడిగా ఉన్నాడు. ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే అతడ్ని రీప్లేస్ చేయాలని బీసీసీఐ భావించింది. కానీ ఇప్పుడు అతడే ఇంజ్యురీ బారిన పడటంతో బోర్డు పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తోంది.


రీప్లేస్‌మెంట్ ఎవరు?

గాయపడిన జైస్వాల్‌ను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు తరలిస్తున్నారని సమాచారం. ముంబై జట్టు తరఫున ప్రాక్టీస్ చేస్తుండగా అతడి ఎడమ కాలి చీలమండకు గాయమైందట. పాత గాయమే తిరగబెట్టిందని తెలుస్తోంది. ఎన్‌సీఏలో అతడు కొన్నాళ్ల పాటు పునరావాసంలో ఉంటాడని, కోలుకున్నాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడతాడని క్రికెట్ వర్గాల సమాచారం. జైస్వాల్ గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ లిస్ట్‌లో మరో ఆటగాడ్ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మరి.. జైస్వాల్‌ స్థానంలో ఎవర్ని రీప్లేస్ చేస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

నన్ను కావాలనే బ్లాక్ చేశారు: ధావన్

వాళ్లేమీ దేవుళ్లు కాదు: అశ్విన్

తెలుగు బిడ్డ సంచలనం.. ఒక్క డైవ్‌‌తో..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2025 | 02:05 PM