IPL 2025: ఐపీఎల్‌కు ఆసీస్ స్టార్లు దూరం.. బీసీసీఐ కోరినా..
ABN , Publish Date - May 12 , 2025 | 08:16 AM
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు ఇదే వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు భారత్-పాకిస్థాన్ ఓకే అనడంతో ఐపీఎల్‌కు రూట్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.

ఇండో-పాక్ ఉద్రిక్తతల వల్ల సస్పెండైన ఐపీఎల్ ఈ నెల 16 లేదా 17వ తేదీన రీస్టార్ట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకోవడం, పరిస్థితులు క్రమంగా మామూలు స్థితికి చేరుకుంటుండటంతో క్యాష్ రిచ్ లీగ్‌కు రూట్ క్లియర్ అయింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే టోర్నీ రీస్టార్ట్ అవుతుంది. మిగిలిన సీజన్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రెడీ చేసే పనుల్లో బీసీసీఐ బిజీగా ఉంది. దీంతో పాటు ఇళ్లకు వెళ్లిపోయిన ఓవర్సీస్ ఆటగాళ్లను కూడా రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బోర్డుతో పాటు ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్లను తిరిగి రావాల్సిందిగా కోరాయి. అయితే ఇతర దేశాల ప్లేయర్లు తిరిగి టోర్నీలో ఆడినా.. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా స్టార్ల రాక మాత్రం అనుమానంగా మారింది. దీనికి రీజన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
వస్తారా.. రారా..
ఆసీస్-ప్రొటీస్ మధ్య జూన్ 11-15 తేదీల మధ్య కీలక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అదే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్. లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డబ్ల్యూటీసీ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌కు మరో నెల రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఆల్రెడీ ఐపీఎల్‌లో ఆడి గాయాలతో సతమతమవుతున్న పేసర్ జోష్ హేజల్‌వుడ్‌ను తిరిగి ఇండియాకు పంపడం రిస్క్ అని ఆసీస్ బోర్డు భావిస్తోందట. టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా భారత్‌కు రావడం కష్టమేనని వినిపిస్తోంది. వీళ్లిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ ఆల్రెడీ ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చేసింది. అటు మిచెల్ స్టార్క్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఈ స్టార్లను ఐపీఎల్‌కు పంపాల్సిందిగా బీసీసీఐ రిక్వెస్ట్ చేసిందని సమాచారం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా వాళ్లను పంపేందుకు కంగారూ బోర్డు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదని రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంలో ఇవాళ లేదా రేపు మరింత స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.
ఇవీ చదవండి:
నాకు కెప్టెన్సీ అక్కర్లేదు: బుమ్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి