Rohit-Anushka: రోహిత్‌ను హగ్ చేసుకున్న అనుష్క.. రితికా చూస్తుండగానే..
ABN , Publish Date - Mar 10 , 2025 | 10:07 AM
ICC Champions Trophy 2025 Final: టీమిండియా మిషన్ కంప్లీట్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్పును సొంతం చేసుకుంది రోహిత్ సేన. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది టీమిండియా. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. చాంపియన్స్ ట్రోఫీని మూడోసారి గెలిచిన తొలి జట్టుగా అవతరించింది. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన ఫైనల్ ఫైట్‌లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రోహిత్ సేన. ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకున్న భారత్.. ఆఖరాటలోనూ అదే రీతిలో పంజా విసిరి కివీస్‌ను చిత్తు చేసింది. గెలుపు తర్వాత ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
హిట్‌మ్యాన్‌ను కలసి..
ఫైనల్స్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా ఒకర్నొకరు కౌగిలించుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ట్రోఫీని చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. కొందరు ఎమోషనల్ కూడా అయ్యారు. ఈ తరుణంలో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన అనుష్క.. తొలుత కోహ్లీని కలిసి హగ్ చేసుకుంది. అతడితో చాలా సేపు ముచ్చటించింది. ఆ తర్వాత రోహిత్, హార్దిక్‌ను హగ్ చేసుకొని వాళ్ల సంతోషంలో పాలుపంచుకుంది. హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దేతోనూ కొద్దిసేపు ఆమె ముచ్చటించింది. కోహ్లీ ఉండగానే ఇతర ఆటగాళ్లతో సంతోషాన్ని షేర్ చేసుకొని వాళ్ల ఫ్యామిలీస్‌తోనూ మాట్లాడుతూ అందరి ఆనందాన్ని డబుల్ చేసింది అనుష్క. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. అందరు ఆటగాళ్లతో ఆమె కలిసిపోయే తీరు, ఫ్రెండ్‌షిప్ మెయింటెయిన్ చేస్తున్న విధానం, సంతోషంలో భాగమవడం చాలా బాగుందని అంటున్నారు. అనుష్క ఎంత సింపుల్‌గా ఉంటారనే దానికి ఇది నిదర్శనమని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క
రోహిత్ హాఫ్ సెంచరీ.. ఊచకోతకు డిసైడై వచ్చాడుగా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి