Share News

Abhishek Sharma: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. యువీనే పొగుడుతున్నారు.. అసలు హీరోను మర్చిపోతున్నారు

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:06 PM

Yuvraj Singh: టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ స్టన్నింగ్ నాక్‌తో అలరించాడు. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ను షేక్ చేశాడు. ఆ జట్టుకు సాలిడ్ లాస్ట్ పంచ్‌ ఇచ్చాడు.

Abhishek Sharma: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. యువీనే పొగుడుతున్నారు.. అసలు హీరోను మర్చిపోతున్నారు
Abhishek Sharma

ఏ రంగంలోనైనా ఎదగాలంటే ఒక్క టాలెంట్ ఉంటే సరిపోదు. క్రమశిక్షణ, నేర్చుకునే తత్వం, ఎప్పటికప్పుడు మెరుగవ్వాలనే ఆలోచన, తపన, పట్టుదల ఎంతో ముఖ్యం. లక్ కలసిరావాలి. అదే సమయంలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అయితే వీటన్నింటి కంటే కూడా అండగా నిలబడే ఓ గురువు లాంటి వ్యక్తి కావాలి. ఆ మాస్టర్ అన్నీ నేర్పించి చేయూతను అందించాలి. సరైన మార్గదర్శనం చేస్తూ నడిపించాలి. టీమిండియా పించ్ హిట్టర్ అభిషేక్ శర్మకు అలాంటి గురువులు ఇద్దరు దొరికారు. అందులో ఒకరు అందరికీ తెలిసిన లెజెండ్ యువరాజ్ సింగ్. మరి.. ఇంకో గురువు ఎవరో ఇప్పుడు చూద్దాం..


లైసెన్స్ ఇచ్చి..

అభిషేక్‌కు దన్నుగా ఉండి నడిపిస్తున్న మరో గురువు మరెవరో కాదు.. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. అవును, సాధారణ బ్యాటర్ స్థాయి నుంచి మూడ్నాలుగేళ్లలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌గా అభిషేక్‌ను యువరాజ్ తీర్చిదిద్దాడు. అలా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ కెరటాన్ని సానబెడుతూ, వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు గంభీర్. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించమని లైసెన్స్ ఇచ్చి.. ఫెయిలైనా సరే టీమ్‌లో ప్లేస్‌కు ఢోకా లేదని గౌతీ ఇచ్చిన ధీమా వల్లే అభిషేక్ బ్యాట్ నుంచి అద్భుతమైన నాక్స్ వస్తున్నాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


స్పెషల్ ట్రైనింగ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు భారత జట్టులోకి అభిషేక్ ఎంట్రీ ఇవ్వడం వెనుక యువరాజ్ పాత్ర ఉంది. అతడి అకాడమీలో శిక్షణ తీసుకొని రాటుదేలాడీ పంజాబీ పుత్తర్. భారీ షాట్లు బాదడం నుంచి స్ట్రైక్ రొటేషన్ వరకు చాలా విషయాల్లో ఆరితేరాడు. అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత ప్రెజర్, కాంపిటీషన్‌ను తట్టుకొని వరుసగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడటంలో అభిషేక్ కొంత తడబడ్డాడు. అడపాదడపా స్పెషల్ నాక్స్ ఆడుతున్నా కొనసాగింపు కొరవడింది. అయితే గంభీర్ అండగా ఉండటం, బ్యాటింగ్ టెక్నిక్‌లో తప్పులను సరిదిద్దడం, బౌన్సర్లను ఎదుర్కోవడంలో శిక్షణ ఇవ్వడం, జట్టులో స్థానంపై గ్యారెంటీ ఇవ్వడంతో అభిషేక్ ఈ రేంజ్‌లో చెలరేగుతున్నాడని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అతడి వెనుక యువీతో పాటు గౌతీ రహస్య శక్తులుగా నిలబడ్డారని.. వారికి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కెరీర్‌లో కొట్టిన సిక్సులు.. ఒకే మ్యాచ్‌లో బాదేశాడు

ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:15 PM