Anjum Chopra: హర్మన్‌ప్రీత్ కౌర్ పై అంజుమ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు!
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:32 AM
తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని దేశ ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు భారత మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
మహిళల వన్డే ప్రపంచకప్2025లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. అలానే తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని దేశ ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు భారత మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వన్డే ప్రపంచకప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేసి బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలని సూచించింది. ఈ వ్యాఖ్యలపై మరో మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఘాటుగా స్పందించింది.
శాంతా రంగస్వామి(Shanta Rangaswamy) సలహాను అంజుమ్ చోప్రా తప్పుబట్టింది. ఓడినా.. గెలిచినా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడింది. ప్రతీ ప్రపంచకప్(Women’s ODI World Cup 2025) తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె(శాంతా రంగస్వామి)కు అలవాటుగా మారిపోయిందని, గత నాలుగు, ఐదు ప్రపంచకప్ టోర్నీలుగా ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నోసార్లు చేసిందని అంజుమ్ తెలిపారు. భారత జట్టు సిరీస్ ఓడిపోయినా కూడా హర్మన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆమె అంటారని, తాజాగా భారత ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా అవే వ్యాఖ్యలు చేస్తున్నారని చోప్రా అన్నారు.
ప్రపంచ కప్ గెలిచిన ఆనంద క్షణాలను తాను చెడగొట్టాలనుకోవడం లేదని, అందుకే శాంతా రంగస్వామి(Shanta Rangaswamy) చేసిన వ్యాఖ్యల గురించి మరింత మాట్లాడుకోవాలనుకోవడం లేదంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఇదే సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా అంజుమ్ చోప్రా ప్రస్తావించారు. 2007-08లో ముంబైలో జరిగిన ఛాలెంజర్స్ ట్రోఫీలో హర్మన్ అండర్ 19 ప్లేయర్‌గా ఉన్నప్పుడే.. హిట్టింగ్ సామర్థ్యం ఉందని గ్రహించానని తెలిపింది. హర్మన్ ఓ మ్యాచ్ విన్నర్ అనే విషయం ఆ రోజే తనకు అర్థమైందని, ఈ క్రమంలోనే హర్మన్(Harmanpreet Kaur)ను కెప్టెన్ చేయాలని పదే పదే డిమాండ్ చేసేదానని అంజూమ్ చోప్రా చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
Mitchell Starc: బౌలింగ్‌లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్..
Former Bangladesh Captain: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు
మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..