Share News

World’s Toughest Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఇవే..

ABN , Publish Date - Nov 19 , 2025 | 07:57 PM

ఇలా కాలేజీలో చదువు పూర్తి కాగానే.. అలా ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేయ్యదు. మంచి ఉద్యోగం రావాలంటే.. మంచి కాలేజీలో చదవాలి. మంచి కాలేజీలో చదవాలంటే.. అందుకు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలి. అలా అయితేనే అత్యుత్తమ ర్యాంకు వస్తుంది.

World’s Toughest Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఇవే..

ఇలా కాలేజీలో చదువు పూర్తి కాగానే.. అలా ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేయ్యదు. మంచి ఉద్యోగం రావాలంటే.. మంచి కాలేజీలో చదవాలి. మంచి కాలేజీలో చదవాలంటే.. అందుకు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలి. అలా అయితేనే అత్యుత్తమ ర్యాంకు వస్తుంది. ఆ తర్వాతే పైచదువులైనా.. ఉన్నత ఉద్యోగమైనా. ఇంజినీరింగ్, వైద్యం, అల్ ఇండియా సర్వీసెస్.. ఇలా ఏ పరీక్షల్లో అయినా మంచి ర్యాంక్ వస్తేనే భవిష్యత్తు బంగారం అవుతుంది. ఈ ఎంట్రన్స్ పరీక్షలు ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సైతం నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. అభ్యర్థి మేథ, ఆలోచన తీరు, స్పందించే వేగంతోపాటు అతడి ఎంత సత్తా ఉందనేది కూడా ఈ పరీక్షల ద్వారా స్పష్టమవుతుంది. అందుకే ఈ ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది.. మంచి ర్యాంక్ సాధించిన వారిని అంతా హీరోలుగా పరిగణిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే.


దేశంలో నిర్వహించే అడ్వాన్స్‌డ్ జేఈఈ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), గేట్ (GATE) పరీక్షలు.. ప్రపంచంలో అత్యంత కిష్టమైన పరీక్షల జాబితాలో చోటు పొందాయి. టాప్ 8లో ఈ మూడు పరీక్షలు ఉన్నాయని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్ ఎరుడెరా తాజాగా వెల్లడించింది. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రపంచంలోనే రెండో కఠినమైన పరీక్ష అని స్పష్టం చేసింది. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షగా ఇది అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. యూపీఎస్‌సీ పరీక్ష మూడో స్థానంలో నిలవగా.. గేట్ (GATE) ప్రపంచంలో 3వ అత్యంత కఠినమైన పరీక్ష అని స్పష్టం చేసింది. దేశంలో ఇది 8వ కఠినమైన పరీక్ష అని ఈ నివేదిక వెల్లడించింది.

ఎరుడెరా నివేదిక ప్రకారం.. ఐఐటీ జేఈఈ సక్సెస్ రేట్ ఒక శాతం ఉండగా.. యూపీఎస్‌సీ పరీక్ష సక్సెస్ రేట్ 0.1 శాతం నుంచి 0.3 శాతం మధ్య ఉంది. గేట్ సక్సెస్ రేట్ దాదాపు 18 శాతంగా ఉంది.


ఎరుడెరా నివేదిక ప్రకారం ప్రపంచంలో టాప్ ఎనిమిది క్లిష్టమైన పరీక్షలు ఇవే..

గావోకావో (Gaokao): చైనాలో గావోకావో ( Gaokao Exam in China) పరీక్ష నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. ప్రతి ఏడాది దాదాపు 10 మిలియన్ల మందికిపైగా విద్యార్థులు ఈ గావోకావో పరీక్షకు హాజరవుతారు. 2025లో గావోకావో పరీక్షకు 13. 35 మిలియన్ల మంది హాజరయ్యారు. 2024లో 13.42 మిలియన్ల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. చైనాలో జాతీయ కళాశాల ప్రవేశ పరీక్ష కోసం ఈ గావోకావో పరీక్షను నిర్వహిస్తారు. చైనీస్, గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో అభ్యర్థి జ్ఞానాన్ని అంచనా వేస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా హ్యూమానిటీస్, సైన్స్, కామర్స్ కోర్సుల్లో అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారు.

కఠిన నిర్ణయం..

ఈ ఎంట్రన్స్ పరీక్ష వేళ చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు తదితర హైటెక్ సాధనాలను అనుమతించకుండా చర్యలు తీసుకుంది.


ఐఐటీ జేఈఈ (IIT JEE): ఈ పరీక్ష ప్రపంచంలోనే రెండో కఠినమైన పరీక్ష. ఇది ఐఐటీలో బీటెక్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహిస్తారు. ఏడాదికి 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్షలో సక్సెస్ రేట్ దాదాపు ఒక శాతంగా ఉంది.


యూపీఎస్సీ పరీక్ష (UPSC Exam): ఈ పరీక్ష ప్రపంచంలోనే మూడో క్లిష్టమైన పరీక్ష. ఈ పరీక్షసక్సెస్ రేట్ 0.1 నుంచి 0.3 శాతం మధ్య ఉంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర ప్రభుత్వ సేవలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.


మెన్సా (Mensa): ఇంగ్లాండ్‌లో మెన్సా పరీక్ష నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే నాలుగో అత్యంత కఠినమైన పరీక్ష. ఐక్యూ ఛాలెంజ్‌లో 25 నిమిషాల్లో 35 పజిల్స్‌ను పరిష్కరించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు.


జీఆర్ఈ (GRE): గ్రాడ్యుయేట్ రికార్డు పరీక్ష (GRE) ప్రపంచంలోనే ఐదో కష్టమైన పరీక్ష. ఈ పరీక్ష.. విదేశాల్లో తదుపరి విద్యను అభ్యసించడానికి ఎంచుకునే విద్యార్థులను అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు.


చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ( CFA): ఈ పరీక్షకు ఆర్థిక రంగంలో అత్యంత డిమాండ్ ఉంది. ఇది సవాలుతో కూడి ఉన్న పరీక్ష. ప్రతి ఏడాది 100కు పైగా దేశాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతారు. ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. నివేదిక ప్రకారం.. CFA సక్సెస్ రేట్ 43 శాతంగా ఉంది.


CCIE: సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఎక్స్‌పర్ట్ (CCIE). ఇది అధునాతన నెట్ వర్కింగ్ సర్టిఫికేషన్ పరీక్ష. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. రాత పరీక్షతోపాటు ల్యాబ్‌లో నిర్వహించే పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. CCIE పరీక్ష సక్సెస్ రేట్ దాదాపు 26 శాతంగా ఉంది.


GATE: ఇంజనీరింగ్, టెక్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో గేట్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి:

 ఏంట్రా ఇదీ.. పోలీస్ వాహనాన్ని వీరెలా వాడారో చూస్తే..

 పనికిరానిదంటూ ఏదీ లేదు.. ఈమె ప్రయోగం చూస్తే వావ్ అనాల్సిందే..

For More Prathyekam And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 08:00 PM