Share News

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:08 PM

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత తనను తీవ్రంగా కించపరుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి హీరోయిన్ త్రిష దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..
Trisha

Trisha: త్రిష అజిత్‌తో కలిసి నటించిన కొత్త చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి నటిని టార్గెట్ చేసి కొందరు నెగటివ్ కామెంట్లు, పోస్టులతో విరుచుకుపడుతున్నారు. దీంతో విసుగెత్తిపోయిన త్రిష వారిపై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్ స్టా, ఎక్స్ వేదికగా ఓ ఘాటైన పోస్ట్ పెట్టారు. ‘‘ విషపూరితమైన మనస్తత్వం ఉన్న మీరు ఎలా జీవిస్తున్నారు? ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? ఖాళీగా కూర్చుని ఇతరుల గురించి సోషల్ మీడియాలో పనికిమాలిన పిచ్చి పోస్టులు చేయడమేనా మీ పని? నిజంగా నేను చాలా చాలా భయపడుతున్నాను. మీతో పాటు, మీ చుట్టుపట్ల ఉండే వ్యక్తుల గురించి తలచుకుంటే బాధగా ఉంది. మీది అనామకత్వం. పిరికితనం. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి.’’


Screenshot 2025-04-11 170743.png

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ తర్వాత త్రిష ఈ పోస్ట్ పెట్టారు. ఈ చిత్రంలో అజిత్ పెర్ఫామెన్స్‌కు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కగా.. త్రిష అందంగా కనిపించినా నటన పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే టాక్ వచ్చింది. సొంత భాష తమిళం అయినప్పటికీ డబ్బింగ్ చెప్పించుకోవడం ఏంటనే విమర్శలు వచ్చాయి. దీంతో రెచ్చిపోయిన ట్రోలర్స్ ఆమెను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో త్రిష సినిమా పేరు ప్రస్తావించకుండా తాజా పోస్ట్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. కానీ, కొందరు త్రిష ఫ్యాన్స్ మాత్రం ట్రోలర్స్‌కు సమాధానంగా ఇది పెట్టలేదని అంటున్నారు.


గుడ్ బ్యాడ్ అగ్లీలో అర్జున్ దాస్, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్లీ, రఘు రామ్ కూడా నటించారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఒక రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్ తన కొడుకును తప్పుడు కేసులో పోలీసులు అరెస్టు చేశాక అతడు ఏం చేశాడనేదే కథ. హీరో అజిత్ సినిమాలో ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించాడు. ఒక పాత్ర కోసం బరువు కూడా తగ్గాడు. కాగా, గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్‌తో త్రిషకు ఆరో చిత్రం. వీరు గతంలో జీ, కిరీడం, మంకథా, యెన్నై అరిందాల్, విదాముయార్చి వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు.


Read Also: Funny Mosquito Video: దోమలపై మరీ ఇంత కోపమా.. ఎలా చంపుతున్నాడో చూస్తే అవాక్కవుతారు..

Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..

Surat Woman and Daughter Assaulted: షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

Updated Date - Apr 11 , 2025 | 05:23 PM