Share News

Viral Video: బస్సు ఎక్కుతున్న మహిళ.. వెనుకే వెళ్లిన యువకుడు.. చివరకు అతడు చేసిన నిర్వాకంతో..

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:14 PM

కొందరు ప్రయాణికులు బస్ స్టాప్ వద్ద వేచి చూస్తుంటారు. ఇంతలో ఓ బస్సు వచ్చి అక్కడ ఆగుతుంది. అంతా బస్సు ఎక్కుతున్న సమయంలో ఓ మహిళ కూడా వారితో పాటూ ఉంటుంది. ఆమె బస్సు ఎక్కుతుండడాన్ని గమనించిన ఓ యువకుడు వెనుకే వెళ్లి నిలబడ్డాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: బస్సు ఎక్కుతున్న మహిళ.. వెనుకే వెళ్లిన యువకుడు.. చివరకు అతడు చేసిన నిర్వాకంతో..

వయసుతో నిమిత్తం లేకుండా మహిళలంతా నిత్యం అనేక రకాల వేధిపుంలకు గురవుతున్నారు. కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా నేరాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో మహిళలను తాకరాని చోట తాకుతూ పైశాసికానందం పొందుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ బస్సు ఎక్కతున్న సమయంలో.. ఓ యువకుడు వెనుకే నిలబడ్డాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ప్రయాణికులు బస్ స్టాప్ వద్ద వేచి చూస్తుంటారు. ఇంతలో ఓ బస్సు వచ్చి అక్కడ ఆగుతుంది. అంతా బస్సు ఎక్కుతున్న సమయంలో ఓ మహిళ కూడా వారితో పాటూ ఉంటుంది. ఆమె బస్సు ఎక్కుతుండడాన్ని (woman boarding bus) గమనించిన ఓ యువకుడు వెనుకే వెళ్లి నిలబడ్డాడు.

Viral Video: దండ వేస్తున్నారా.. దండిస్తున్నారా.. ఈ వరుడికి పెద్ద చిక్కే వచ్చిపడిందిగా..


తీరా ఆమె బస్సు ఎక్కుతున్న సమయంలో నడుంపై చెయ్యి వేసి, తాకరాని చోట తాకుతూ (young man misbehaves with woman) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలకు షాక్ అయిన ఆమె.. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అతన్ని పక్కకు ఈడ్చుకొచ్చి కొడుతుంది. ఇంతలో చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమికూడతారు. అంతా యువకుడిని తిడుతూ మందలిస్తారు. దీంతో షాకైన ఆ వ్యక్తి.. తాను ఎలాంటి తప్పూ చేయలేదంటూ వారిపైనే తిరగబడతాడు. అతడి చేష్టలతో చివరకు బాధితురాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండిపోతుంది.

Viral Video: అలసిపోయి చెట్టు కింద కూర్చున్న సింహం.. అంతలోనే పైనుంచి పడిపోయిన జింక.. చివరకు..


అయితే ఇదంతా చూస్తుంటే వారంతా కావాలని ఇలా ప్లాన్ చేసి తీసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మహిళలపై ఇలాంటి దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘అంతా బాగా యాక్ట్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్పీడ్ బోటును వెంబడించిన నీటి ఏనుగు.. చివరికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 01:47 PM