Viral Video: స్పీడ్ బోటును వెంబడించిన నీటి ఏనుగు.. చివరికి ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:46 AM
కొందరు పర్యాటకులు స్పీడ్ బోట్‌లో ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు. ఇంతలో వారికి ఊహించని అనుభవం ఎదురవుతుంది. అంతలోనే నీటి ఏనుగు వారిని వెంబడిస్తుంది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

నీటి ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నీటి ఏనుగులకు తిక్క రేగితే పులులు, సింహాలు వంటి క్రూర జంతువులు కూడా భయంతో పారిపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు మనుషులను కూడా వెంబడించి మరీ దాడి చేస్తు్న్నాయి. తాజాగా, నీటి ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ నీటి ఏనుగు స్పీడ్ బోటును వెంబడించింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు పర్యాటకులు స్పీడ్ బోట్‌లో ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు. ఇంతలో వారికి ఊహించని అనుభవం ఎదురవుతుంది. దూరంగా ఓ నీటి ఏనుగు కనిపిస్తుంది. దాన్ని చూసిన వారు ఏం చేస్తుందిలే.. అని అనుకుని అంతా అనుకున్నారు.
Viral Video: బ్యాడ్మింటన్ రాకెట్‌తో వింత ప్రయోగం.. పదో అంతస్థు నుంచి ఎలా వదిలాడో చూడండి..
అయితే నీటి ఏనుగు మాత్రం వారికి సడన్ షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి వారిపై దాడికి యత్నించింది. నీటి ఏనుగు తమ వైపు రావడాన్ని గమనించిన వారు బోటు వేగాన్ని పెంచారు. అయినా నీటి ఏనుగు బోటును (Hippopotamus chasing speed boat) వదలకుండా వెంటపడింది. దీంతో వారు బోటు వేగాన్ని మరింత పెంచి దూరంగా వెళ్లిపోయారు. నీటి ఏనుగు చాలా దూరం వరకూ వారిని వెంబడించి చివరకు చేసేదేమీలేక అగిపోయింది.
Viral Video: ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే ఇదే జరుగుతుంది.. స్లాబ్ వేస్తుండగా ఉన్నట్టుండి..
ఈ ఘటనను బోటులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పరిస్థితుల్లో మేముంటే ప్రాణాలే పోయేవి’’.. అంటూ కొందరు, ‘‘నీటి ఏనుగులతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..