
Breaking News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు..
ABN , First Publish Date - Jul 12 , 2025 | 09:29 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 12, 2025 19:44 IST
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.
ఒక రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో : 1,39,297 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 95,534 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 883.00 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుతం : 204.3520 టీఎంసీలు
కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
-
Jul 12, 2025 17:14 IST
విశాఖ: ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్-4 మ్యాచ్ లు: ఏసీఏ సెక్రటరీ సతీష్
14న ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహిస్తున్నాం
మొత్తం 25 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాం: ఏసీఏ సెక్రటరీ సతీష్
మాచ్‌లన్నీ విశాఖ వేదికగా జరుగుతాయి
వచ్చే సీజన్‌లో మరిన్ని వేదికలలో మ్యాచ్‌లు నిర్వహిస్తాం: ఏసీఏ సెక్రటరీ సతీష్
-
Jul 12, 2025 17:12 IST
చిత్తూరు: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌కు మంత్రి గొట్టిపాటి పరామర్శ
వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన ఫొటో గ్రాఫర్ శివకుమార్
శివకుమార్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి
శివకుమార్‌కు అండగా ఉంటామని గొట్టిపాటి భరోసా
శివకుమార్‌పై దాడి చేసిన వారిని వదిలిపెట్టం: మంత్రి గొట్టిపాటి
-
Jul 12, 2025 16:05 IST
తిరుమలలో ముగిసిన టీటీడీ, దేవదాయశాఖ సమావేశం
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఆనం
టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర అధికారులతో కలిసి సమీక్ష చేశాం: ఆనం
గతంలో సీఎం సమీక్షలో ఆలయాలకు చెందిన కొన్ని సమస్యలు వచ్చాయి
ఆయా సమస్యలపై చర్చించి రావాలని సీఎం ఆదేశించారు: ఆనం
9 శాతం కామన్‌గుడ్ ఫండ్ టీటీడీ తీసుకోవాలని నిబంధనలు: ఆనం
గతంలో 5 శాతం ఉన్న దాన్ని 9 శాతానికి పెంచాం: ఆనం
-
Jul 12, 2025 15:44 IST
కృష్ణా: గుడివాడలో ఫ్లెక్సీ కలకలం..
కొడాలి నాని, చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు.
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేస్తానన్న వ్యాఖ్యలు నిలిబెట్టుకోవాలని ఫ్లెక్సీ.
-
Jul 12, 2025 12:37 IST
కోల్‌కతాలో మరో అత్యాచార ఘటన
IIM కోల్‌కతా బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం
IIM విద్యార్థినిపై అక్కడే చదువుతున్న విద్యార్థి అత్యాచారం
బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కౌన్సెలింగ్ పేరుతో తనకు కూల్‌డ్రింక్ తాగించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు
-
Jul 12, 2025 09:29 IST
లిక్కర్ కేసులో నేడు సిట్ ముందుకు విజయసాయిరెడ్డి
సిట్ నోటీసులతో రెండోసారి సిట్ ముందుకు విజయసాయి
విజయవాడ సిట్ ఆఫీస్‌లో విజయసాయి విచారణ
గత ఏప్రిల్ 18న విజయసాయిని విచారించిన సిట్
విజయసాయి సమాచారంతో కదిలిన లిక్కర్ కేసు విచారణ
తాను విజిల్ బ్లోయర్‌నని చెప్పుకున్న విజయసాయి
లిక్కర్ స్కాంలో తనకు తెలిసినవన్నీ చెబుతానన్న విజయసాయి
లిక్కర్ కేసులో A-5 విజయసాయిరెడ్డి
విజయసాయి సిట్ విచారణతో వైసీపీ నేతల్లో భయం
-
Jul 12, 2025 09:29 IST
కూకట్‌పల్లి కల్తీకల్లు ఘటనలో బాధితులకు కొనసాగుతుతో వైద్యం
నిమ్స్‌లో 33 మంది బాధితులకు చికిత్స
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 9మందికి కిడ్నీ సమస్యలు
మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి
చికిత్స పొందుతున్న వారిలో 11 మంది నిలకడగా ఆరోగ్యం
ఇంకో 12 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స
మరో 19మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స ఇప్పటివరకు కల్తీకల్లు ఘటనలో 9 మంది మృతి
ప్రధాన నిందితుడు సత్యంగౌడ్‌ను అరెస్టు చేసిన కూకట్‌పల్లి పోలీసులు
కూన సత్యం గౌడ్ అరెస్టుతో ఐదుకు చేరిన నిందితుల సంఖ్య
ఇప్పటికే కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ సీఐపై వేటు
మరికొంతమంది సిబ్బందిపై విచారణకు ఎక్సైజ్ శాఖ ఆదేశం
-
Jul 12, 2025 09:29 IST
కొంపల్లి డ్రగ్స్ కేసుపై కొనసాగుతోన్న దర్యాప్తు
మరికొంతమందిని అరెస్ట్ చేయనున్న ఈగల్ టీం
మన్వాడ రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటు ఆరుగురికి రిమాండ్
మరో 19 మందికి నోటీసులు ఇవ్వనున్న ఈగల్ టీం
పబ్ యజమానులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం
పరారీలో ఉన్న వారికోసం లుకౌట్ నోటీసులు జారీ చేయనున్న అధికారులు