Share News

Nimisha Priya case: నిమిష ప్రియకు ఊరట.. ఉరిశిక్ష రద్దు చేసిన యెమెన్..!

ABN , Publish Date - Jul 29 , 2025 | 08:17 AM

కేరళ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) మరణశిక్ష విషయంలో యెమెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ దౌత్యం, గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ అహ్మద్ సహా అనేక మంది మత పెద్దలు చేసిన చర్చలు ఫలించాయి. యెమెన్ అధికారులు ఉరిశిక్ష రద్దుకు అంగీకరించినట్లు సున్నీ లీడర్ ఏపీ అబూబకర్ కార్యాలయం ప్రకటించింది.

Nimisha Priya case: నిమిష ప్రియకు ఊరట.. ఉరిశిక్ష రద్దు చేసిన యెమెన్..!
Nimisha Priya Death Sentence Cancelled :

Nimisha Priya Death Sentence Cancelled: నిమిష ప్రియ(Nimisha Priya) ఉరిశిక్ష రద్దు విషయంలో కొనసాగుతున్న ఊగిసలాటకు తెరపడినట్లే కనిపిస్తోంది. 2017లో యెమెన్ పౌరుడి హత్య కేసులో దోషిగా తేలినప్పటి నుండి రాజధాని సనాలో జైలు శిక్ష అనుభవిస్తోంది నిమిష. జులై 16న అమలు కావాల్సిన మరణశిక్ష ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్లడ్ మనీ కోసం బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు భారతీయ దౌత్యాధికారులు, సున్నీ లీడర్ ఏపీ అబూబకర్, కేఏ పాల్ సహా అనేక మంది మతపెద్దలు తీవ్ర చర్చలు జరిపారు. మొత్తానికి వారి చర్చలు ఫలించాయి. యెమెన్ ప్రభుత్వం దిగివచ్చింది. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు అంగీకారం తెలిపినట్లు ఏపీ అబూబకర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


యెమెన్‌ హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయినట్లు.. కాంతాపురం భారత గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ కార్యాలయం వెల్లడించింది. 'నిమిష ప్రియ మరణశిక్షను రద్దు చేశారు. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు ' అని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని యెమెన్‌లోని యాక్షన్‌ కౌన్సిల్‌ ఫర్‌ తలాల్‌ మహదీస్‌ జస్టిస్‌ ప్రతినిధి సర్హాన్‌ షంశాన్‌ అల్‌ విశ్వాబి ధృవీకరించారు. భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.


అయితే, మరణశిక్ష రద్దు తర్వాత నిమిష ప్రియ విడుదలవుతుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో రెండే దారులు ఉన్నట్లు. జీవిత ఖైదు లేదా బ్లడ్ మనీ ఇచ్చి విడుదల అవుతుందా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మృతుడు తలాల్‌ మెహదీ కుటుంబ సభ్యులతో నిమిష కుటుంబం జరుపుతున్న చర్చలు ఫలిస్తేనే ఆమె విడుదలకు మార్గం సుగమం అవుతుంది.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 10:43 AM