Share News

America: ఉగ్రవాద కార్యకలాపాలపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 18 , 2025 | 09:06 AM

అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. టీఆర్‌ఎఫ్‌ని గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా గుర్తించింది. లష్కర్-ఎ-తోయిబా అనుబంధంగా టీఆర్‌ఎఫ్‌ గుర్తించింది.

America: ఉగ్రవాద కార్యకలాపాలపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన
America

ఢిల్లీ: అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ని (TRF) విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. టీఆర్‌ఎఫ్‌ని గ్లోబల్ టెర్రరిస్ట్ (Global Terrorist) సంస్థగా అమెరికా గుర్తించింది. లష్కర్-ఎ-తోయిబా (LET) అనుబంధంగా టీఆర్‌ఎఫ్‌ గుర్తించింది. 2025 ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం దాడికి టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించిందని తెలిపింది. ఇది 26మంది భారత పౌరుల ప్రాణాలు తీసిన దాడి అని.. 2008 ముంబై దాడుల తర్వాత అత్యంత ఘోర ఘటనగా పేర్కొంది అమెరికా విదేశాంగ శాఖ.


2024లో భారత భద్రతా బలగాలపై టీఆర్‌ఎఫ్‌ దాడులు చేసిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ పాలన కీలక నిర్ణయం, జాతీయ భద్రత, ఉగ్రవాద నిరోధంపై అమెరికా సంకల్పం ప్రకటించిందని స్పష్టం చేసింది. పహల్గాం దాడికి న్యాయం చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారని గుర్తుచేసింది. LET, TRFతో సహా అనుబంధాలపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. వలస చట్టం సెక్షన్ 219, కార్యనిర్వాహక ఉత్తర్వు 13224 కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అధికారిక గెజిట్‌‌లో ప్రచురితమైన వెంటనే ప్రభావంలోకి వస్తోందని ట్రంప్ పాలనా యంత్రాంగం పేర్కొంది. ఉగ్రవాదం అమెరికాతో సహా పాశ్చాత్య దేశాల ద్వంద వైఖరిపై తీవ్ర స్థాయిలో భారత విదేశాంగ శాఖ స్పందించింది.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 10:34 AM