Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:05 PM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై విపక్షాలు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారనుకుంటే.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు.

ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారణంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే.. సందేహ పడుతున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు. విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
ఉగ్రవాదులను మట్టుబెడితే ఆనందం వ్యక్తం చేస్తారనుకున్నానని.. కానీ విపక్ష సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచించాలంటూ హితవుపలికారు. ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం వారిలో కనిపించలేదని చెప్పారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు.. ఆధారాలు ఉన్నాయా అన్న చిదంబరం ప్రశ్నకు అమిత్ షా స్పందించారు. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
పాక్‌కు క్లీన్‌చిట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం తగదని హితవుపలికారు అమిత్ షా. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి కొన్ని పాక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని అమిత్‌షా క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి