Share News

TVK Vijay: విజయ్‌ భరోసా.. మీకు అండగా ఉంటా..

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:21 AM

గత నెలలో కరూర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్‌ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్‌లో రోడ్‌షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్‌ పరామర్శించారు.

TVK Vijay: విజయ్‌ భరోసా.. మీకు అండగా ఉంటా..

- మహాబలిపురం రిసార్ట్‌లో ప్రత్యేక భేటీ

చెన్నై: గత నెలలో కరూర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్‌(Vijay) భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్‌(Karoor)లో రోడ్‌షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని సోమవారం విజయ్‌ పరామర్శించారు.


nani3.3.jpg

మహాబలి పురం సమీపంలోని పూంజేరి వద్దనున్న ఓ రిసార్ట్‌లో మృతుల కుటుంబీకులను, గాయపడినవారిని ఆయన ఓదార్చారు. కరూర్‌ నుండి ఐదు ఆమ్నీ బస్సుల్లో మహాబలిపురానికి రప్పించిన కుటుంబీకులందరినీ ఒక్కో గదిలో బస కల్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు విజయ్‌ ఆ రిసార్ట్‌ వద్దకు చేరుకున్నారు. పార్టీ ప్రముఖులతో కలిసి ప్రతి గదిలోకి వెళ్ళి మృతుల కుటుంబీకులను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి పావుగంట సమయాన్ని కేటాయించి విజయ్‌ వారిని పరామర్శించి నగదు కానుకలు అందజేశారు.


ఇదే విధంగా గాయపడినవారికి తలా రూ.2లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. కరూర్‌ నుండి మహాబలిపురానికి రప్పించటంలో మృతుల కుటుంబీకులకు ఏర్పడిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పుకుంటున్నానని, జీవితాంతం తాను వారి కుటుంబంలో ఒకడిగా ఉంటానని, ఏ సహా యం కావాలన్నా ఏ సమయంలోనైనా తనను కలుసు కోవచ్చునని విజయ్‌ చెప్పారు. కరూర్‌ వచ్చి ఓదార్చాలని అనుకున్నా, భద్రతా కారణాలకు తోడు, కల్యాణమండ పాలు లభించక పోవడం వల్లే తాను రాలేకపోయానని సంజాయిషీ ఈ సందర్భంగా ఇచ్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 28 , 2025 | 11:21 AM